తన మీడియా తన శత్రువు...!
**********
నిజంగా పుష్కర ఏర్పాట్లలో ఏ ప్రభుత్వం కూడా పూర్తిగా పనులు చేయలేదు.. అది తెలంగాణ అయినా సరే.. ఆంధ్రా అయినా సరే.. ఎందుకంటే కోట్ల మంది భక్తులు వచ్చే పెద్ద వేడుక ఇది.. ఇందులో లోటు పాట్లు ఉంటాయి.. అయితే రాజమండ్రిలో జరిగిన ఉదంతంలో ఆంధ్రా ప్రభుత్వం తప్పు కన్నా ఆంధ్రా మీడియా తప్పే ఉంది.. ఎందుకంటే పనులు పూర్తికాలేదు.. తగిన ఏర్పాట్లు లేవని ముందే జనాలను హెచ్చిరించే కథనాలు రాసి ఉంటే బాగుండేది.. కానీ బ్రహ్మాండం బద్ధలయ్యేలా ఏర్పాట్లు జరిగాయి.. అహో.. ఒహో అంటూ గత వారం రోజులుగా కథనాలు రాస్తూ వస్తుంది.. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఏర్పాట్లు లేవు.. ఇక నీళ్లు లేవని కథనాలు రాసింది... దీంతో ప్రతీ ఒక్కరూ రాజమండ్రికి పుష్కర స్నానానికి వెళ్లే వాతావరణాన్ని క్రియేట్ చేసింది... కానీ అధికారులు, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు భక్తుల సంఖ్యకు సరిపోలేదు.. వారిని కట్టడి చేయడంలో అందరూ చేతులెత్తేశారు.. ఫలితంగా ఇంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు...
తన కోపం తన శత్రువు అన్న మాట విన్నాం కానీ... చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి మాత్రం తన మీడియా తన శత్రువుగా తయారైంది...
వీళ్లు చేసిన అతి వల్ల పెద్దసంఖ్యలో జనాలు వచ్చి ప్రాణాలను కోల్పోయారు..
తగిన ఏర్పాట్లు చేయకపోయినా భారీ ఏర్పాట్లు చేసినట్లు తప్పుడు కథనాలు రాసిన మీడియా కూడా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సగటు నెటిజన్‌గా నేను డిమాండ్ చేస్తున్నా...!!

No comments:
Post a Comment