1

1

Friday 17 July 2015

బీటెక్ విద్యార్థుల‌ను త‌ల‌ద‌న్నే వేత‌నాలు పొందుతున్న పారిశుధ్య కార్మికులు..

నాలుగేళ్ల క్రితం అనుకుంటా.. ఓ తెలుగు దిన ప‌త్రిక‌లో ఓ స్టోరీ చ‌దివాను.. చాలా ఆస‌క్తిగా అనిపించింది..
***********
సాఫ్ట్‌వేరు రంగం ప‌తాక‌స్థాయిలో ఉన్న స‌మ‌యంలో ఓ బీటెక్ చేసిన కుమార్తెకు నెల‌కు రూ.30 వేల జీతం వ‌చ్చేది.. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగం చేసే తండ్రికి రూ.20 వేల జీత‌మే వ‌చ్చేది.. తండ్రిని మించిన త‌న‌యులు అంటూ ఆ ప‌త్రిక‌లో క‌థ‌నం రాశారు..
తండ్రి 30 ఏళ్లు క‌ష్ట‌ప‌డి ప్ర‌స్తుతం ఎంత జీతం సంపాదిస్తున్నారో.. కుమారులు, కుమార్తెలు తొలి వేత‌నం అంత క‌న్నా ఎక్కువ పొందుతున్నార‌ని ఆ క‌థ‌నం సారాంశం...
****************
ఇప్పుడు బీటెక్ నిరుద్యోగులు ఎక్కువ‌య్యారు.. ఐదారు వేల‌కు ప‌నిచేసే వాళ్ల సంఖ్య వేల‌ల్లో ఉంది... చ‌దువుకున్న వారి క‌న్నా ఎక్కువ సంపాదిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు అని క‌థ‌నం రాస్తే బాగుంటుంది...
ఇంకో విశేషం చెప్పాలంటే ఆ క‌థ‌నం రాసే రిపోర్ట‌ర్ క‌న్నా జీహెచ్ఎంసీ కార్మికుడి జీత‌మే రెట్టింపు ఉంటుంది..
ఉన్న‌త విద్యాభ్యాసం చేసి అర‌కొర జీతంలో బ‌తుకీడుస్తున్న నిరుద్యోగుల వెత‌లను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపేలా క‌థ‌నం రాయాలి.. ఏ ప‌త్రికా ఆ సాహ‌సం చేయ‌క‌పోవ‌చ్చునేమో... ఎందుకంటే వాళ్ల ప‌త్రిక‌ల్లోనే వెట్టి చాకిరిలో మ‌గ్గుతున్న స‌బ్ ఎడిట‌ర్లు, రిపోర్ట‌ర్లు ఎంద‌రో ఎంద‌రెంద‌రో?

No comments:

Post a Comment