దేశంలో ఐపీఎల్‌కు నేను ఆద్యుడనని లలిత్ మోడీ చెప్పుకుంటున్నాడు.. కానీ దేశంలో ఐపీఎల్ రావడానికి కారణం జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ అన్నది జగమెరిగిన సత్యం... 2007లో ప్రపంచ దేశాలకు చెందిన క్రీడాకారులతో వారు ఇండియన్ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించారు.. అందులో అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్నీ లాంటి ఆటగాళ్లు రెండు సీజన్లకు ఆడారు.. అంతర్జాతీయ ఆటగాళ్లయిన లారా, క్రిస్ కెయిన్స్ తదితరులూ ఆడారు.. కానీ బీసీసీఐ అండదండలు లేకపోవడంతో అది ముగిసిపోయింది.. ఐసీఎల్ స్ఫూర్తితో దేశంలో ఐపీఎల్ పురుడుపోసుకుంది... క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకునే లలిత్ మోడీకి, ఆయనే ఇంత స్థాయికి ఐపీఎల్‌ను తీసుకెళ్లాడనే మీడియా కూడా ఐసీఎల్‌ను గుర్తుంచుకోకపోవడం గమనార్హం... ఒకవేళ ఐసీఎల్‌కు బీసీసీఐ మద్దతు ఇచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో?
No comments:
Post a Comment