1

1

Friday, 3 July 2015

వాళ్ల రాజ‌కీయ జీవితాల‌ను స‌మాధి చేసింది ఆయ‌నే... మ‌ళ్లా వారికి పున‌ర్జ‌న్మ ఇస్తుందీ ఆయ‌నే...

వాళ్ల రాజ‌కీయ జీవితాల‌ను స‌మాధి చేసింది ఆయ‌నే... మ‌ళ్లా వారికి పున‌ర్జ‌న్మ ఇస్తుందీ ఆయ‌నే... 14 ఏళ్ల‌లో ఆయ‌న అస్తిత్వం, ఉనికిని తెలంగాణ‌లో లేకుండా చేయాల‌నుకున్న వాళ్లద్ద‌రి అస్తిత్వాన్నే ప్ర‌శ్నార్థ‌కం చేశాడు.. ఇప్పుడు మ‌ళ్లా వాళ్లద్ద‌రినీ అక్కున చేర్చుకుని రాజ‌కీయ భిక్ష పెడుతూ పున‌ర్జ‌న్మ‌నిస్తున్నాడు... 
*******
రాజ‌కీయంగా వెలుగులో లేని సంతోష్‌రెడ్డి, జ‌గ్గారెడ్డి, దుంగ్యాల శ్రీ‌నివాస‌రావు, శారారాణి త‌దిత‌ర ఎంద‌రినో చేర‌దీసి రాజ‌కీయ భిక్ష పెట్టాడు.. చివ‌రకు వారితోనే శాప‌నార్థాలు తిన్నాడు.. ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న పార్టీల‌కు చెందిన కొండా సురేఖ‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, తుమ్మ‌ల నాగేశ్వ‌రావు లాంటి వాళ్లెంద‌రో అన‌కూడ‌ని మాట‌లతో దూషించినా భ‌రించాడు.. రాజ‌కీయంగా వాళ్లు క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితుల్లో మ‌ళ్లా వాళ్లంద‌రికీ రాజ‌కీయ పున‌ర్జ‌న్మ‌నిచ్చాడు...
************
నీ అస్తిత్వాన్నే లేకుండా చేయాల‌నుకునే వారిని ద‌గ్గ‌ర‌కు తీయ‌డం అతి మంచిత‌నం అవుతుంది... కొన్నిసార్లు ప్ర‌మాద‌క‌రం కూడా.. అప్ర‌మ‌త్త‌త‌తో ఉండ‌తం అత్యంత అవ‌స‌రం.. చేర‌దీయ‌డం మీ వ్య‌క్తిగ‌త విష‌యం కాదు.. ఎందుకంటే మీరు తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి... మీ చెంత‌న చేరే వారు మీకు అన్యాయం చేస్తే అది తెలంగాణ స‌మాజానికి జ‌రిగే అన్యాయ‌మే అవుతుంది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!!!

No comments:

Post a Comment