1

1

Friday 17 July 2015

జ‌ర్న‌లిస్టుల‌కు క‌నీస వేత‌నాలు ఇప్పించాలి..

తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...
***********
ప‌త్రిక‌ల్లో ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌కు వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సులు అమ‌లు కావ‌డం లేదు.. సుప్రీంకోర్టు ఆదేశించినా స‌రే ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.. కేంద్ర కార్మిక శాఖ కూడా రాష్ట్రాల‌దే బాధ్య‌త అని చెప్పి చేతులు దులుపుకుంది... ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మ‌జిథియా వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల‌ను ప‌టిష్టంగా అమ‌లు చేయిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. దాదాపు 15 ఏళ్లుగా జ‌ర్న‌లిస్టుల‌కు వేత‌న స‌వ‌ర‌ణ జ‌ర‌గ‌లేదు.. మ‌జిథియా సిఫార్సుల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని కొన్ని ప‌త్రిక‌లు అర‌కొర జీతాలు పెంచి చేతులు దులుపుకున్నాయి.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను నియ‌మించి ప్ర‌తీ ప‌త్రిక‌లోనూ వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల‌ను ఎలా అమ‌లు చేస్తున్నారో బ‌హిరంగం విచార‌ణ చేయించాల‌ని విజ్ఞ‌ప్తి.. జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో వెలుగులు నింపండి..!!
నోట్‌: ప్రైవేటు సంస్థ‌ల్లో రోజంతా ప‌నిచేసినా క‌నీస వేత‌నానికి నోచుకోని సిబ్బందిని ఆదుకోండి.. కార్మిక చ‌ట్టాల‌ను ప‌టిష్ఠంగా అమ‌లు చేయాల‌ని విజ్ఞ‌ప్తి...

No comments:

Post a Comment