తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే హైదరాబాద్‌కు మాత్రం ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి ఉందని వెంకయ్యనాయుడి అంటున్నారు...
మరి చంద్రబాబునాయుడేమో నేనే హైదరాబాద్‌ను తీర్చిదిద్దానంటున్నారు... కొంచెం ఆయనకు సమజ్ అయ్యేలా చెప్పండి సార్.!!
రుణ మాఫీతో సమస్యలు పరిష్కారం కావని వెంకయ్య అంటున్నారు...
మరి ఎన్నికల సమయంలో ఈ ముక్క చెప్పి ఉంటే బాగుండేదేమో...
ఇక రాత్రికి రాత్రి అభివృద్ధి అసాధ్యమని వెంకయ్య అంటున్నారు.. ఎంత కష్టపడ్డా 9 నెలల కన్నా ముందే బిడ్డ పుట్టడు కదా అని ఉదహరిస్తున్నారు..
మరి తెలంగాణ ప్రభుత్వ పనితీరు దారుణమని వంద రోజులకే బీజేపీ వాళ్లు డిసైడ్ చేస్తున్నారు.. ఈ ఉదాహరణ వాళ్లకూ చెప్పండి సార్...
పన్నులు వేయకుండా సంపద సృష్టి అసాధ్యమంటున్నారు.... సంపద పెంచితేనే కదా పంచడానికి వీలవుతుందని.. అందుకోసం ఆర్థిక సంస్కరణలు చేయాలి కదా అని అంటున్నారు..
మరి సార్.. యూపీఏ వాళ్లు పన్నులు వేస్తే పేదలపై భారం అయినప్పుడు.. మీరు వేస్తే ఎవరిపై భారం అవుతుందో సెలవు ఇవ్వొచ్చు కదా...
No comments:
Post a Comment