ఉస్మానియాలో విద్యార్థులుపై బాష్పవాయువు గోళాలు ప్రయోగిస్తున్నారు... హాస్టల్లలో ఉన్న అమ్మాయిలపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు అంటే... అయ్యో నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్(ఎన్‌బీఏ) మార్గదర్శకాలు అడ్డొస్తున్నాయి... పోలీసులు రెచ్చగొట్టే వార్తలు వేయొద్దన్నారు అంటూ ఒక్క బ్రేకింగ్ న్యూస్ వేయలేం.. ఒక్క ఫొటో ప్రచురించలేమంటూ నాటకాలాడిన మనుషులు వాళ్లు....
మరి సీమాంధ్రలో విగ్రహాలు కూలినా, ఏ చిన్న పోలీసు కవాతు జరిగినా.. ఇదేం అణచివేత అంటూ ప్రశ్నించిన గొంతులు అవే...
ఇవన్నీ గుర్తొంచినప్పుడు.. నా డైరీలో పేజీలు చూసిన ప్రతీసారి ఇరాక్ చట్టాలు మనవద్ద ఎందుకు లేవా? అన్న ప్రశ్న నన్ను వేధిస్తుంది...
ఏది ఏమైనా స్వచ్ఛమైన జర్నలిజం దీర్ఘకాలం వర్థిల్లాలి... అనైతికపు జర్నలిజం అంతం కావాల్సిందే... !!!
No comments:
Post a Comment