అంతరిక్ష రంగంలో ప్రస్తుతం భారత్ రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లడం వెనక ఎందరో శాస్త్రవేత్తల కృషి దాగుంది... మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) విజయవంతం కావడానికి కృషి చేసిన అందరు శాస్త్రవేత్తలకు శతకోటి అభినందనలు.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా 1960లో చిన్నగా మొదలైన భారత అంతరిక్ష కార్యకలాపాలు.. నేడు మంగళ్‌యాన్ విజయవంతంతో పతాకస్థాయికి చేరాయి..అంతరిక్ష రంగంలో భారత్ కీర్తిపతాకను విశ్వవినువిధుల్లో సగర్వంగా ఎగరవేసేందుకు మంగళ్‌యాన్ విజయం దోహదపడింది.. ఇవన్నీ ఇస్రో రాత్రికి రాత్రే సాధించిన విజయాలు కావు... దీని వెనక ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం, దేశభక్తి, ప్రతిభ దాగి ఉన్నాయి... అగ్రరాజ్యాలకు భారత్ ఏ మాత్రం తీసిపోదని మరోమారు నిరూపించిన శాస్త్రవేత్తలందరికీ పాదాభివందనాలు.. ఈ విజయం మరిన్ని వినూత్న ప్రయోగాలకు నాంది కావాలని ఆకాంక్షిస్తున్నాం.. దేశంలోని మరింత మంది యువ, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు మీరు ప్రేరణగా నిలవాలని కోరుతున్నాం... !!
జయహో ఇస్రో... భారత్ మాతా కీ జై...!!
No comments:
Post a Comment