1

1

Sunday, 21 September 2014

అతి విశ్వాసం వ‌ద్దు.. ఆందోళ‌న అస‌లే వ‌ద్దు...

May 19, 2014
తెలంగాణ మిత్రులు కొన్ని విష‌యాల్లో అతి విశ్వాసంగా క‌నిపిస్తారు.. కొన్ని విష‌యాల్లో పూర్తి ఆందోళ‌న‌కు గుర‌వుతారు.. ముఖ్యంగా గ‌జ్వేల్‌లో కేసీఆర్ గెలుస్తాడా? లేదా అని ఆంధ్రా ఛానెల్స్ చ‌ర్చ పెట్ట‌డం.. అంద‌రూ భ‌య‌ప‌డి పోవ‌డం చేశారు.. తెలంగాణ ప్ర‌జ‌లు ఎప్పుడైనా స‌రే ఎక్క‌డి వారైనా స‌రే కేసీఆర్‌ను ఓడించ‌లేదు.. ఓడించ‌లేరు కూడా... ఎందుకంటే కేసీఆర్‌ను ఓడిస్తే వాళ్ల‌ను వాళ్లు ఓడించుకున్న‌ట్లే లెక్క అన్న‌ది వాళ్ల‌కు తెలుసు... మాన‌సికంగా దెబ్బ‌కొట్టాల‌న్న వ్యూహంలో భాగంగానే ఆంధ్రా మీడియా ఈ ఎత్తుగ‌డ వేశారు.. ఇలాంటివి ఇంకా వేస్తూనే ఉంటారు.. మ‌నోధైర్యంతో మ‌నం ప‌ది మందిని చైత‌న్యం చేయాలి కానీ... మ‌న‌మే కుంగిపోయి ఇంకా ప‌దిమందిని కుంగ‌దీసే భ‌యాలు రేకెత్తించొద్దు...

అయితే కొన్ని స్థానాల్లో గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క అనుకున్నాం.. కానీ అందులో మాత్రం బొంక బోర్లా ప‌డ్డాం.. ముఖ్యంగా ప‌ర‌కాల‌, పాల‌కుర్తి, ప‌రిగి, చేవెళ్ల‌, నాగ‌ర్ క‌ర్నూల్‌... ఈ స్థానాల్లో గెలుసు చాలా సుల‌భ‌మ‌ని అతి విశ్వాసంతో ఉంటే అక్క‌డ ఓడిపోయాం..

No comments:

Post a Comment