వాళ్ల ఇంట్లో పుట్టిన రోజు వార్తలు వేసుకుంటారు.. వాళ్ల కుటుంబ సభ్యుల, బంధువుల పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లిన వార్తలు వేసుకుంటారు.. చివరకు వాళ్ల వాళ్లు ఎవరైనా పోయినా వార్తలు వేసుకుంటారు.. మరి వాళ్లు కోర్టుకు వెళ్లినా, వారిపై ఏమైనా కేసులు నమోదైనా ఆ వార్తలు మాత్రం మెయిన్ పేపర్లో కాదు కదా మినీల్లోని జోన్ పేజీల్లో కూడా కనిపించవ్... ప్రైమ్ టైమ్ బులెటిన్‌లో కాదు కదా.. అర్ధరాత్రి స్క్రోలింగ్ కూడా రాదు... ఎందుకు?
ఇదెక్కడి జర్నలిజం.. విచిత్రం ఏంటంటే వాళ్ల కులపోళ్ల మీడియా సంస్థలన్నింటిలోనూ వారిపై నెగటివ్ కథనాలు రావు.. మరి ఎందుకిలా..?
జర్నలిజానికి కుల జాఢ్యం అంటించింది ఎవరు?
రోడ్డు మీద బర్రె చచ్చిపోయినా, పంది చచ్చిపోయినా జోన్ పేజీలో వార్తలు వేసే పెద్దమనుషులారా? మీరు కోర్టుల చుట్టూ తిరిగినా, మీ కంపెనీలపై కేసులు నమోదైనా వార్తలు ఎందుకు వేసుకోరు? ఇతర మీడియా సంస్థల్లోనూ ఆ వార్తలు రాకుండా ఎలా అడ్డుకోగలుగుతున్నారో సెలవివ్వండి? మీ పై నెగటివ్ వార్తలు ఏ పేపర్‌లోనూ, ఛానెల్‌లోనూ రాకుండా చేయడాన్ని ఏ రకం సిండికేట్ అంటారు? మీకు మీకు మధ్య ఏ రకం మాఫియా సంబంధాలు ఉన్నాయో కాస్త సెలవివ్వండి...!!!
No comments:
Post a Comment