1

1

Sunday, 21 September 2014

వ‌చ్చే ఐదేళ్ల‌లో గూర్ఖాలాండ్‌, విద‌ర్భ రాష్ట్రాల ఏర్పాటు?

May 17, 2014
గూర్ఖాలాండ్‌, విద‌ర్భ రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చింది... రేపు ఆయా ప్రాంతాల ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉన్న పార్టీగా బీజేపీ గూర్ఖాలాండ్‌, విద‌ర్భ రాష్ట్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని కోరుకుంటున్నాను... గూర్ఖాలాండ్ కోసం ఎంద‌రో ప్రాణ‌త్యాగం చేశారు... విద‌ర్భ ప్రాంతంలో అభివృద్ధి జ‌ర‌గాల‌న్నాకూడా రాష్ట్ర ఏర్పాటు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది... బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లోక్‌స‌భ‌లో ఉంది... రాజ్య‌స‌భ‌లో ఎలాగూ కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇస్తుంది కాబ‌ట్టి ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటు అంత క‌ష్ట సాధ్యం కాక‌పోవ‌చ్చు.... శివ‌సేన, తృణ‌మూల్ కాంగ్రెస్‌ను ఒప్పించి విద‌ర్భ‌, గూర్ఖాలాండ్ రాష్ట్రాల‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది...

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను కూడా మూడు రాష్ట్రాలుగా చేయాలి... పరిపాల‌న సౌల‌భ్యం నిమిత్తం దాన్ని మూడు నాలుగు రాష్ట్రాలుగా చేయాలి... వీలైతే రాష్ట్రాల పున‌ర్విభ‌జ‌న క‌మిష‌న్‌ను ఏర్పాటు చేయాలి.... చిన్న రాష్ట్రాల‌తోనే అభివృద్ధి సాధ్యం అన్న బీజేపీ నినాదానికి అనుగుణంగా దేశంలో 50 రాష్ట్రాల‌ను
ఏర్పాటు చేస్తే మేలు.... దీనిపై ఎన్డీయే దృష్టిసారించాలి...

No comments:

Post a Comment