May 20, 2014
టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి...
మంత్రి పదవులు వస్తే తీసుకోండి కానీ రచ్చ చేయొద్దు... ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం ఎదురుచూశారు.. చివరికి ఎందరో ఆశావహులు ఉండగా మీకు మాత్రమే అవకాశం దక్కింది.. అవకాశం దక్కని వాళ్లు చాలా మంది ఉన్నారు.. రేపు మంత్రి పదవుల కోసం కొట్లాడొద్దు.. పదవి వస్తే తీసుకోండి.. పదవి దక్కకున్నా కూడా సంతృప్తితోనే పనిచేయండి... జీవితంలో మళ్లా మంత్రి పదవి వస్తుందో లేదో అన్న భావనలో మాత్రం ఉండకండి... స్థానిక ప్రజలకు అందుబాటులో ఉన్నంత కాలం మీకు అవకాశాలు వస్తూనే ఉంటాయి... పదవులు వరిస్తూనే ఉంటాయి... ఓడిపోయిన నేతలకు(ఏ పార్టీ వారైనా సరే) కూడా విజ్ఞప్తి... ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి మీరు ఓడిపోయారు.. అంత మాత్రాన నిరాశ చెందొద్దు... ప్రజల్లోనే ఉండండి.. పక్క చూపుల చూడొద్దు... మరోమారు అవకాశం తలుపు తట్టేంత వరకు మన పని మనం చేసుకుంటూ నిరీక్షించాలి.. ఆ ఓపిక లేని వాళ్లు దాసోజు శ్రవణ్ దారిలో నడవండి... !!! |
No comments:
Post a Comment