1

1

Thursday, 18 September 2014

కేసీఆర్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్న డ్రామోజీ!

ఫ్లాష్‌... ఫ్లాష్‌... ఫ్లాష్‌...
నిన్న మెట్రో కుట్ర వెన‌క ఉన్న చాలా కోణాలు ఇప్ప‌టికే నా పోస్టులో చూపాను. తాజాగా మ‌రో కోణం దాగి ఉంద‌ని తెలిసింది. దీనిపై ఈనాడు అంత‌ర్గ‌తంగా పెద్ద చ‌ర్చ జ‌రుగుతుంది. అస‌లే డ్రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా డ్రామోజీకి న‌ష్టాలే త‌ప్ప లాభాలు లేవు. జ‌గ‌మంతా దోచి... అక్క‌డ దాచి పెట్టాడు. అందుకే మొన్న మార్గ‌ద‌ర్శిలో ఒక్క‌సారిగా డ‌బ్బులు ఇవ్వాలంటే బ్లాక్‌స్టోన్ పేరిట రిల‌య‌న్స్‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అస‌లు డ్రామోజీ ఫిల్మ్ సిటీ ఉనికే ప్ర‌మాదంలో ప‌డే సంకేతాలు డ్రామోజీకి క‌నిపించాయి. అదెట్లంటే... రాచ‌కొండ గుట్ట‌ల్లో ఉన్న రెండు వేల ఎక‌రాల ప్ర‌భుత్వ భూముల్లో ఇత‌ర ప్రాంతాల‌కు ధీటైన సినీ సిటీని నిర్మించేందుకు కేసీఆర్ నిర్ణ‌యించారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న రాగా... అధికారులు కూడా స్థ‌ల‌న్వేష‌ణ‌లో ఉన్నారు. మ‌రి ఇదే జ‌రిగితే... దాని ప‌క్క‌నే ఉన్న డ్రామోజీ ఫిల్మ్ సిటీ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోక త‌ప్ప‌దు. ఇప్పుడొచ్చే అర‌కొర టికెట్ల డ‌బ్బ‌లు కూడా రావు. అప్పుడో ఇప్పుడో వ‌చ్చే అవార్డులు, అతిథులు కూడా ఆ వంక క‌న్నెత్తి చూడ‌రు. అందుకే కేసీఆర్ ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌నేది డ్రామోజీ స‌వాలు. సూసిండ్రా... ప్రాంతాభివృద్ధి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి ప‌ని ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో సీమాంధ్ర పెట్టుబ‌డిదారుడికి న‌ష్టాన్ని క‌లిగించేదే. అంటే ఇన్నాళ్లూ తెలంగాణ అభివృద్ధి ప్రైవేటుగా జ‌రిగి, సీమాంధ్ర పెట్టుబ‌డుదారుల‌ను బ‌డా వ్యాపార‌వేత్త‌లుగా మార్చింది. అదే ప్ర‌భుత్వ‌ప‌రంగా అభివృద్ధి జ‌రిగితే వాళ్ల ఉనికికే ప్ర‌మాద‌మ‌న్న‌మాట‌. అందుకే వాళ్లు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్ర‌భుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు మెట్రో కుట్ర ప‌న్నాడ‌నేది ఈనాడువ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.

No comments:

Post a Comment