1

1

Sunday, 28 September 2014

నిజాం న‌గ‌ల‌ను హైద‌రాబాద్ లో ప్ర‌ద‌ర్శించాలి...అందుకు ఏర్పాట్లు చేయాలి...

1995లో కేంద్ర ప్ర‌భుత్వం నిజాం వార‌సుల నుంచి రూ.217 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌(ఇప్పుడు దాని విలువ 10 రెట్లు ఎక్కువ‌) ఆభ‌ర‌ణాల‌ను హైద‌రాబాద్ లో ప్ర‌ద‌ర్శించాలి.. ప్ర‌స్తుతం ఢిల్లీ నేష‌న‌ల్ మ్యూజియం క‌స్ట‌డీలో ఆ న‌గ‌లు ఉన్నాయి.. వాటిని రిజ‌ర్వు బ్యాంకు లాక‌ర్ల‌లో భ‌ద్ర‌ప‌రిచారు.. ఈ ఆభ‌ర‌ణాల‌ను ఎక్క‌డ ప్ర‌ద‌ర్శించాల‌నే విష‌యంపై కేంద్రం ఎటూ తేల్చుకోలేక‌పోతోంది.. అయితే హైద‌రాబాద్‌కు వీటిని తెప్పించాల‌ని కేసీఆర్ గారు కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి... గ‌తంలో చిరంజీవి కేంద్ర ప‌ర్యాటక మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ హైద‌రాబాద్‌లోనే వీటిని శాశ్వ‌తంగా ప్ర‌ద‌ర్శించాల‌ని కేంద్రానికి సూచించారు... హైద‌రాబాద్ రాజ్యానికి సంబంధించిన‌వి కాబ‌ట్టి అదే ఉత్త‌మ వేదిక అవుతుంద‌ని ఆయ‌న అన్నారు... ఏది ఏమైనా ప‌టిష్ఠ భ‌ద్ర‌త‌, అనువైన ప్రాంతంలో ఈ న‌గ‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తే అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌ను, జాతీయ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించొచ్చు... ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చొర‌వ తీసుకోవాలి.. కేంద్రం కూడా న‌గ‌ల‌ను ఆర్బీఐ లాక‌ర్ల‌లో ఉంచితే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యాన్ని గుర్తించాలి...
నిజాం ఆస్తుల విలువ 12 లక్ష‌ల కోట్ల‌ని ఓ వార్త చ‌దివాను.. ఇంత‌కీ ఇవి ఎవ‌రి ఆధీనంలో ఉన్నాయి.. ? ఒక‌వేళ తెలంగాణ ప్ర‌భుత్వ ఆధీనంలో ఉంటే వీటిని ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం వినియోగించొచ్చేమో.. కేంద్రం ఆధీనంలో ఉంటే.. వాటిని తెలంగాణ‌కు బ‌దిలీ చేసే అవ‌కాశం ఉందా? ఉంటే వీటితో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌న్నీ సాఫీగా అమ‌లు చేయొచ్చు క‌దా... బంగారు తెలంగాణ ల‌క్ష్యం సులువుగా సాధించొచ్చేమో...!!

No comments:

Post a Comment