1

1

Wednesday, 24 September 2014

ఎందుకురా ఈ బ‌ట్టెబాజీ రాత‌లు..?

తెలంగాణ ఏర్ప‌డినా, ఏర్ప‌డ‌కున్నా... రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయినా, కాకున్నా... కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చినా, రాకున్నా...
కేంద్ర ప్ర‌భుత్వం మెట్రో రైలుపై గెజిట్ జారీ చేసింది. ఎందుకంటే అదేదో ఈ ప్రాజెక్టును త‌న చేతుల్లోకి తీసుకునేందుకు కాదు... ఒక‌వైపు ఎల్అండ్‌టీ ప‌నులు చేస్తుంది. మ‌రి ఆ ప‌నుల‌ను సాంకేతికంగా ప‌రిశీలించి, అప్రూవ్ చేసేది ఎవ‌రు?. ఇది ఎల్అండ్‌టీకి త‌ల‌కాయ నొప్పి. మొన్న ట్ర‌య‌ల్‌ర‌న్ చేశారు. కానీ దాన్ని ధ్రువీక‌రించేది ఎవ‌రు?. వాస్త‌వంగా రైల్వే సంబంధిత నిపుణులు ప‌రిశీలించి, ధ్రువీక‌రించాలి. మ‌రి ప్ర‌భుత్వం ప్రైవేటు నిపుణుల‌ను ఎందుకు ఎంగేజ్ చేసుకుంటుంది. బాజాప్తా భార‌తీయ రైల్వేకు చెందిన నిపుణుల‌తో ప‌రిశీల‌న చేయిస్తుంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మ‌న మెట్రో రైలు ట్రామ్‌వేస్ చ‌ట్టం ప‌రిధిలోకి వ‌చ్చింది. ఇలా ఉంటే రైల్వే నిపుణులు వ‌చ్చి ప‌రిశీలించ‌డానికి వీలులేదు. అందుకే కేంద్ర రైల్వే ప‌రిధిలోకి తీసుకువ‌స్తే ఆ వెసులుబాటు ఉంటుంది. ఇదే ప్ర‌ధాన కార‌ణంగా గెజిట్ జారీ అయింది. ఈ వాస్త‌వ‌మంతా మ‌న ప‌చ్చ ప‌త్రిక‌లు, ప‌చ్చ పార్టీకి తెలుసు. కానీ ఇదేదో ఎల్అండ్‌టీ చంద్ర‌బాబు స‌హ‌కారంతో కేంద్రం నుంచి తెప్పించుకుంద‌ని, ఇదేదో కేసీఆర్‌కు షాక్ అని బ‌ట్టెబాజ్ రాత‌లు మ‌ళ్లీ మొద‌లుపెట్టిండ్రు.
మ‌రి ఇదే నిజ‌మైతే...రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే (గ‌తంలోని స‌ర్కారైనా) కేంద్రానికి లేఖ రాసి, ప్రాజెక్టును కేంద్రంలో చేతులు పెడుతుందా?. గ‌త న‌వంబ‌రులో ఈ మేర‌కు రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసింది. దీన్ని కూడా ఆంధ్ర‌జ్యోతి ఈ ఏడాది మొద‌ట్లో అని త‌ప్పు రాసింది. ఈ కించిత్తు లాజిక్ తెలుసుకోకుండా రాష్ట్ర ప్ర‌భుత్వానికేదో అయిపోయింది... అధికారాలు అన్నీ కేంద్రం చేతుల్లోకి పోయిన‌వి అని ఎందుకు రాస్తున్నారో అర్థం కావ‌డంలేదు. వాళ్ల మ‌న‌సులోని కోరిక‌ల‌ను ఈ అక్ష‌ర‌రూపంలో తీర్చుకుంటున్నారే త‌ప్ప రాజ్యాంగ‌బ‌ద్దంగా అన్ని రాష్టాల్లెక్క తెలంగాణ‌కు అన్ని ర‌కాల స‌ర్వాధికారాలు ఉన్నాయే త‌ప్ప చంద్ర‌బాబు, వెంక‌య్య‌నాయుడు, డ్రామోజీ, రాధాకృష్ణ‌ల చేతుల్లో రాజ్యాంగం ఉండ‌దు. అంత‌కుమించి కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఉండ‌దు. 
ఇక‌... అలైన్‌మెంట్ మార్పు ఉండ‌ద‌ని ప‌చ్చ ప‌త్రిక సంక‌లు గుద్దుకుంటుంది. కానీ వాస్త‌వాలు తెలుసుకోకుండా, తెలిసినా కావాల‌ని త‌ప్పు రాసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డం వృథా ప్ర‌యాస‌నే. ఎందుకంటే అస‌లు అలైన్‌మెంట్‌తో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. కేంద్ర రైల్వే చ‌ట్టం ప‌రిధిలో ఉన్నందున ఫార్మాలిటీ ప్ర‌కారం ఏవైనా మార్పులు, పురోగ‌తి ఉంటే ఒక కాపీ కేంద్రానికి పంపుతారు. క‌థంతా రాష్ట్ర ప్ర‌భుత్వం, ఎల్అండ్‌టీకి సంబంధించిన‌దే. అందుకే ఇప్ప‌డు జారీ చేసిన గెజిట్‌లో నాగోల్‌-శిల్పారామం మార్గం అంత‌వ‌ర‌కే ఉంది. కానీ వాస్త‌వంగా దాన్ని రాయ‌దుర్గం వ‌రకు పొడ‌గించారు. ఆ మార్పు ఈ గెజిట్‌లో లేదు. గ‌తంలో పంపిన ప్ర‌తిపాద‌న‌లు బీరువాలో ఉంటే మొన్న తెలంగాణ సీఎస్‌పోయి మెట్రో పెండింగు ప‌నులుంటే త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు. ప‌చ్చ పార్టీ, ప‌త్రిక‌ల గొడ‌వల నేప‌థ్యంలో కేంద్రం త‌న నిర్ల‌క్ష్యం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని పాత పైళ్ల‌ను తీసి గెజిట్ జారీ చేసింది. నిజంగా ఎల్అండ్‌టీ ఈ గెజిట్ జారీ అయ్యేలా చేసి ఉంటే, రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కేంద్రం జారీ ఉంటే క‌చ్చితంగా అందులో రాయ‌దుర్గం వ‌ర‌కు మార్గం పొడ‌గించిన‌ట్లు ఉండేది. ఎందుకంటే రేవంత్‌తో స‌హా అంద‌రి గొడ‌వంతా రాయ‌దుర్గం భూముల మీద‌నే క‌దా. ఈ లాజిక్‌ను కూడా ఆంధ్ర‌జ్యోతి మిస్స‌యింది. లేక‌పోతే పాఠ‌కులు ఎవ‌రు ఇవ‌న్నీ చూస్తారులే... మాకు మా రిపోర్ట‌ర్ల‌కే ఇవ‌న్నీ తెలుస‌ని పిచ్చి పిచ్చి రాత‌లు రాస్తుంది. తెలంగాణ‌వాదులారా... ఈ గెజిట్‌తో వ‌చ్చింది లేదు, పోయింది లేదు... ఏమైనా ప్ర‌యోజ‌న‌మంటూ ఉంటే... ట్ర‌య‌ల్‌ర‌న్‌, ఇత‌ర ప‌నుల‌ను రైల్వే శాఖ నిపుణులు వ‌చ్చి చూసేందుకు ఇదో ఉత్త‌ర్వులు లాంటివి అంతే.

No comments:

Post a Comment