1

1

Thursday, 25 September 2014

మ‌న‌మూ చీపురు ప‌డ‌దాం...


సామాజిక బాధ్య‌త‌...
స్వ‌చ్ఛ్‌ తెలంగాణ‌ మ‌హోద్య‌మంలో మ‌న‌మూ భాగ‌స్వాములం అవుదాం...!!
ప‌రిశుభ్ర‌, సుంద‌ర తెలంగాణ స్వ‌ప్నాన్ని సాకారం చేసుకుందాం..
మ‌న‌మూ చీపురు ప‌డ‌దాం...
రోడ్డు ప‌క్క‌న బ‌స్టాప్‌లో చెత్త పోగై దుర్ఘందం వ‌స్తుంటే ముక్కుమూసుకొని స‌ఫాయి కార్మికుల‌ను తిట్ట‌డ‌మో, ప్ర‌భుత్వాన్ని తిట్ట‌డ‌మో చేస్తాం. కానీ ఆ చెత్త పోగు కావ‌డానికి మ‌న‌లో ఒక‌రే కార‌ణం.. ఒక స‌మ‌యంలో మ‌న‌మూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి రోడ్డ‌పైనే చెత్త‌ను ప‌డేశామ‌న్న విష‌యాన్ని మ‌ర‌చిపోతాం... దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో పారిశుద్ధ్య లోప‌మూ ఒక‌టి... ఈ విష‌యం అంద‌రికీ తెలిసినా ప‌ట్టించుకోం.. ఈ ప‌రిశుభ్ర‌తను ఒక పారిశుద్ధ్య కార్మికుడే చేయాల‌ని ఏం ఉంది... మ‌న‌మూ న‌డుం బిగించొచ్చు క‌దా..
అక్టోబ‌రు 2వ తేదీన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చీపురు ప‌డ‌తానంటున్నాడు.. దేశ ప్ర‌ధానే చీపురు ప‌డుతున్న‌ప్పుడు మ‌న‌కు ఎందుకు మోహ‌మాటం.. ఒక‌వేళ రోడ్డుపై చెత్త‌ను ఊడ్చ‌డం ఇష్టం లేద‌నుకుంటే మ‌న ఇళ్లునే కార్య‌క్షేత్రంగా ఎంచుకుందాం... కార్యాల‌యాల‌ను ఎంపిక చేసుకుందాం.. ప‌రిశుభ్ర‌త కోసం వారంలో రెండు గంట‌లు కేటాయించాల‌ని ప్ర‌ధాని పిలుపునిస్తున్నాడు... మ‌నం వారాంతపు సెల‌వుల్లో ఒక‌రోజును కేటాయిస్తే త‌ప్పేముంది... విదేశీ యాత్రికులు మ‌న దేశంపై చేసే ఫిర్యాదులో పారిశుద్ధ్య లోప‌మూ ఒక‌టి... ఇది మ‌నం సిగ్గుప‌డాల్సిన అంశం.. మ‌న‌ది సుంద‌ర భార‌త‌మ‌ని.. ప‌రిశుభ్ర భార‌త‌మ‌ని నిరూపిద్దాం.. మ‌న స‌మాజాన్ని, మ‌న న‌గ‌రాన్ని, మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకునే మ‌హ‌త్కార్యంలో భాగ‌స్వాముల‌వుదాం... !!
స్వ‌చ్చ్ తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా నేను ప్ర‌తిజ్ఞ చేస్తున్నా..
చెత్త‌ను చెత్త డ‌బ్బాలో మాత్ర‌మే వేస్తాను.. చెత్త డ‌బ్బా క‌నిపించ‌క‌పోతే నా జేబులోనైనా పెట్టుకుని తిరుగుతాను..
రోడ్డుపై ఎక్క‌డా మూత్ర విస‌ర్జ‌న చేయ‌ను... కేవ‌లం మూత్ర‌శాల‌ల్లో మాత్ర‌మే మూత్ర విస‌ర్జ‌న చేస్తాను..
వీలైతే 10 మందికి ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తా..
నేను పాటిస్తున్నా.. మీరూ పాటించండ‌ని సూచిస్తా...
ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...
ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త అంద‌రికీ న‌చ్చుతుంది.. అయితే త‌గిన‌న్ని చెత్త డ‌బ్బాలు పెట్ట‌డం, మూత్ర‌శాల‌లు ఏర్పాటు చేయ‌డం లాంటివి కూడా చేయండి... ప్లాస్టిక్ నిషేధాన్ని క‌ఠినంగా అమ‌లు చేయండి.. ఇంకా ఏమైనా సూచ‌న‌లు ఉన్నా పాటిచండి...

No comments:

Post a Comment