1

1

Sunday, 21 September 2014

ఆంధ్రా ఉద్యోగులు చేసిన స‌మ్మె కాలానికి వేత‌నం ఇవ్వండి..

May 23, 2014
ఫ‌న్‌టాక్‌...

ఈ ఆంధ్రా ఉద్యోగులు ముఖం మీద ఉమ్మేసినా ఇక్క‌డే ఉండ‌టానికి ఎందుకు ఇష్ట‌ప‌డుతున్నారా? అని బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుని ఆలోచిస్తే ఒక విష‌యం అర్థం అయ్యింది... ఆంధ్రా ఉద్యోగులు చంద్ర‌బాబునాయుడి వ‌ద్ద ప‌నిచేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ట‌... ఆయ‌న ప‌ద‌వీ కాలంలో ఉద్యోగుల‌ను వేధించిన తీరు గుర్తుకొచ్చి భ‌య‌ప‌డుతున్నార‌ట‌... హింసించే 23వ పుల‌కేసి క‌న్నా దారుణ‌మైన వ్య‌క్తి వ‌ద్ద మేం ప‌నిచేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని వారు లోలోప‌ల మ‌థ‌న ప‌డుతున్నార‌ట‌... అయితే అస‌లు కార‌ణం ఇంకోటి ఉన్న‌ట్లు తెలంగాణ ఉద్యోగులు గుస‌గుస‌లు పెట్టుకుంటున్నారు...

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల‌కు ఇక్రిమెంట్లు ఇస్తామ‌ని, కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స‌మానంగా వేత‌నాలు ఇస్తామ‌ని కేసీఆర్ ప‌దేప‌దే చెప్ప‌డంతో ఎలాగైనా ఇక్క‌డే తిష్ట‌వేసి ఆ ఇక్రిమెంట్లు కొట్టేయాల‌ని ఆశ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం...

చంద్ర‌బాబుకు ఒక‌టే విజ్ఞ‌ప్తి....

స‌క‌ల జ‌నుల స‌మ్మె చేసిన ఉద్యోగుల‌కు కేసీఆర్ ఎలాగైతే స‌మ్మెకాలానికి వేత‌నం ఇవ్వ‌డంతోపాటు వారి స‌ర్వీసు కాలాన్ని కాపాడుతాన‌ని హామీ ఇచ్చారో మీరు కూడా ఆంధ్రా ఉద్యోగులు చేసిన స‌మ్మె కాలానికి వేత‌నం ఇవ్వండి.. వారి స‌మ్మె కాలాన్ని ఇన్‌స‌ర్వీసుగానే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి.. స‌మైక్యాంధ్ర కోసం కొట్లాడిన ఉద్యోగుల‌కు ఇక్రిమెంట్లు ఇవ్వండి... ఎలాగూ మోడీ గారూ మీ క్లోజ్ ఫ్రెండే కాబ‌ట్టి.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వేత‌నాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించండి.... అప్పుడు ఆంధ్రా ఉద్యోగులు మీ ద‌గ్గ‌రికే వ‌స్తారు... దొంగ స‌ర్టిఫికేట్ల‌తో ఇక్క‌డ ఇక్రిమెంట్లు కొట్టేసేందుకు కుట్ర‌లు చేయ‌ర‌ని అనుకుంటున్నా....!!!!

No comments:

Post a Comment