బ్రేకింగ్ న్యూస్...
జర్నలిస్టులకు మజీథియా వేజ్ బోర్డు సిఫార్సులను అమలు చేసిన పచ్చ పత్రిక...
జర్నలిస్టుల జీతాలు కనీవినీ ఎరుగని రీతిలో రూపాయి నుంచి 80 రూపాయల వరకు పెరిగిన వైనం...
పెరిగిన జీతాలతో ఏం పండగ చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉద్యోగులు....
ఇంకొంత మందికి మజీథియా సిఫార్సులు అమలు చేస్తే జీతాల్లో కోత పెట్టాల్సి ఉంటుందంటూ పరోక్ష హెచ్చరికలు..
అసలు జర్నలిస్టుల కోసం వేతన సవరణ సంఘం నివేదిక ఇచ్చిన జస్టిస్ మజీథియా కూడా ఆశ్చర్యపోయేలా వాళ్ల జీతాలను పెంచింది పచ్చ పత్రిక యాజమాన్యం... తన మార్కు స్టైల్లో మజీథియా సిఫార్సులను అమలు చేసింది.. ఈ సిఫార్సులు అమలు చేస్తే కనీసం 2 రెట్ల నుంచి గరిష్టంగా 3 రెట్ల వరకు జర్నలిస్టుల జీతాలు పెరుగుతాయని నివేదిక ఇచ్చిన సమయంలో జస్టిస్ మజీథియా కూడా అన్నారు... దాదాపు పదేళ్లుగా వేతన సవరణ లేకుండా అష్టకష్టాలు పడుతున్న జర్నలిస్టుల జీవితాల్లోకి ఈ కమిటీ వెలుగు తెస్తోందని పాత్రికేయులు సంబర పడ్డారు.. అయితే ఈ నివేదిన అమలు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ దాదాపు మూడేళ్లు న్యాయపోరాటం చేసి ఓడిపోయిన యాజమాన్యాల్లో పచ్చ పత్రిక కూడా ఉంది.. అయితే చాలా యాజమాన్యాలు విధిలేక వేజ్‌బోర్డు సిఫార్సులను అమలు చేస్తున్నాయి...
ఎలాగైనా ఈ సిఫార్సుల అమలను ఆపించాలని ఒంటరిగానే చివరగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి భంగపడిన పచ్చ పత్రిక యాజమాన్యం మరో మహత్తర ఎత్తుగడ వేసింది... అసలు నగరాల్లో సంస్థ ఆఫీసు ఉంటే హెచ్ ఆర్ ఏ, ట్రావెలింగ్ అవెన్సులు భారీగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి... ఉద్యోగులందరినీ వాళ్లకున్న చిత్ర నగరి(అదో సామాజ్ర్యం)లోకి మకాం మార్చారు.. ఇప్పుడు మాది గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఉద్యోగులకు 10 శాతం హెచ్ ఆర్ ఏ ఇస్తాం, 5 శాతం ట్రావెలింగ్ అలవెన్సు ఇస్తాం... అని నిర్ణయించింది.. ఇంకా కొన్ని అలవెన్సులు ఎగ్గొట్టింది... ఉద్దండ పండితులైన ఛార్టెడ్ అకౌంటెంట్‌లను రప్పించి జీతాలను కుదించి, మదించి అన్నీ చేసి చివరకు మజీథియా వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేసినట్లు ఈ రోజు సగర్వంగా, సిగ్గులేకుండా ప్రకటించారు...
పే స్లిప్పులు చూసిన ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు... దాదాపు 12 వేలు కనీసం పెరుగుతాయనుకున్న ఉద్యోగి జీతం ఒక రూపాయి పెరిగింది... 15 వేలు పెరుగుతాయనుకున్న జర్నలిస్టుల జీతం 30 రూపాయలు పెరిగింది...ఇంకొంత మందికైతే వేతన సవరణ సంఘం సిఫార్సుల కన్నా ఎక్కువ జీతాలను ఇస్తున్నామని యాజమాన్యం అంటోందట.. భవిష్యత్తులో ఎక్కడ తమ జీతాల నుంచి కోత విధిస్తారో అన్న భయంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు.. ఇక రూపాయి నుంచి 100 రూపాలయ మధ్య జీతాలు పెరిగిన వాళ్లు నవ్వాలో ఏడవాలో తెలియక తలలు పట్టుకున్నారు...
ఇదండీ పత్రికల్లో కార్మిక చట్టాల అమలు, వేతన సవరణ సంఘం అమలు తీరు... వీళ్లు జనాలకు, ప్రభుత్వాలకు నీతులు చెబుతారు...
వీళ్లు రాసింది భగవద్గీతలాగా లేదా ఇతర పవిత్ర గ్రంథంలాగా మన ఫీలై చదవాలన్నట్లు బిల్డప్‌లు ఇస్తారు.. వీళ్లను ఆధునిక కాలపు దొరలు అంటే తప్పులేదేమో...!!
వీళ్లు రాసింది భగవద్గీతలాగా లేదా ఇతర పవిత్ర గ్రంథంలాగా మన ఫీలై చదవాలన్నట్లు బిల్డప్‌లు ఇస్తారు.. వీళ్లను ఆధునిక కాలపు దొరలు అంటే తప్పులేదేమో...!!
నోట్: ఆ సంస్థలో పనిచేస్తున్న ఆంద్రా జర్నలిస్టులదీ ఇదే పరిస్థితి.. విజయవాడలో ఆ సంస్థ ఆఫీసును గ్రామపంచాయతీకి తరలించారు..
No comments:
Post a Comment