1

1

Sunday 21 September 2014

ఇంజినీరింగ్ కాలేజీల‌పై స‌మీక్షించాలి...

May 22, 2014
ఫీజు రీఎంబ‌ర్స్‌మెంట్‌పై ఆధార‌ప‌డి అవి మ‌నుగ‌డ సాగిస్తున్నాయి..
నాణ్య‌మైన అధ్యాప‌కులు లేరు...
అర‌కొర వ‌సతుల‌తో బోధ‌న‌...
ఇలాగైనా తెలంగాణ‌లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి అసాధ్యం...

ప‌దేళ్ల పాటు విద్యా సంస్థ‌ల ప్ర‌వేశానికి ఉమ్మ‌డి విధానం అమ‌లులో ఉంటుంద‌ని కేంద్రం పేర్కొంది...
అలాంట‌ప్పుడు తెలంగాణ‌లో చ‌దివే ఆంధ్రా విద్యార్థి ఫీజు రీ ఎంబ‌ర్స్‌మెంట్‌ను ఆంధ్రా ప్ర‌భుత్వం భ‌రించాలి... ఇది సాధ్య‌మా... ఈ ప‌థ‌కాన్ని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వం ప్రారంభించింది.. దీన్ని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వాలు కొన‌సాగిస్తాయా?
నాకు తెలిసి ఈ ప‌థకం కేవ‌లం ప్రైవేటు విద్యాసంస్థ‌ల పాలిట క‌ల్ప‌త‌రువుగా మారింది... విద్యార్థుల‌ను చేర్చుకొని ప్ర‌భుత్వం నుంచి
డ‌బ్బులు గుంజుతున్నాయి.. ఇంకా చెప్పాలంటే రాజ‌కీయ నాయ‌కులే విద్యాసంస్థ‌ల అధిప‌తులుగా ఉన్నారు.. వారి కోస‌మే ఈ ప‌థ‌కం ఎక్కువ ఉప‌యోగ‌ప‌డుతుంది.. చివ‌రికి బోధ‌న ఫీజులు చెల్లించ‌డం లేద‌ని చెప్పి బ్లాక్‌మెయిల్‌కు పాల్ప‌డుతున్న‌ది కూడా వాళ్లే... అస‌లు వీరి విద్యాసంస్థ‌ల్లో సిబ్బంది ఎలా ఉన్నారు... వారికి విద్యార్హ‌త ఉందా లేదా ప‌ర్య‌వేక్షించే వారే క‌ర‌వ‌య్యారు.. ఫ‌లితంగా ల‌క్ష‌ల్లో ఇంజినీర్లు వ‌స్తున్నారు కానీ నైపుణ్యం కొర‌వ‌డుతోంది.... ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యా బోధ‌న ఉండాలి... వృత్తి నైపుణ్యాలు పెంచేందుకు.. సృజ‌నాత్మ‌క ఆలోచ‌న విధానాన్ని పెంపొందించేందుకు ప్ర‌త్యేక విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలి... పుట్ట‌గొడుగుల్లా ఉన్న ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల‌పైన చ‌ర్య‌లు తీసుకోవాలి...

చ‌దువుకోవాల‌నుకున్న‌ నిరుపేద విద్యార్థికి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ప‌టిష్ఠ చ‌ర్య‌లు తీసుకోవాలి.... విద్యావ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేయ‌కుండా తెలంగాణ అభివృద్ధి అసాధ్యం... నైపుణ్యాలు సంపాదించ‌కుండా ఎన్ని డిగ్రీలు సంపాదించినా కూడా ఆ విద్యార్థి తెలంగాణ స‌మాజానికి
భారంగానే మారుతాడు... చిన్నా చిత‌కా ఉద్యోగాల కోసం ప్ర‌భుత్వంపైనే ఆధార‌ప‌డుతాడు.. మ‌రి తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి కార్యాచ‌ర‌ణ రూపొందిస్తుందో వేచిచూడాలి... !!!

No comments:

Post a Comment