May 19, 2014
గర్వాన్ని దరి చేరనివ్వొద్దు...
ఉజ్వల భవిష్యత్తు మీకు ఉంది.. ఉన్నత శిఖరాలు ఎక్కే అవకాశం ఉంది.. పదవులు రావడంతోనే అధికారదర్పాన్ని ప్రదర్శించొద్దు.. ఎప్పుడూ జనంతోటే ఉండండి.. జనం గుండెల్లో ఉండండి... చిన్న వయస్సులోనే గొప్ప అవకాశం లభించింది మీకు.. ఎంపీ పదవికి పోటీ చేసే అవకాశం బాల్క సుమన్‌కు, ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అవకాశం గాదిరి కిశోర్‌కు లభించింది... ఈ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు.. తెలంగాణ ప్రజలు ఇద్దరు యువ కిశోరాలను పార్లమెంట్, అసెంబ్లీకి పంపుతున్నారు... వాస్తవానికి ఈ ఇద్దరికీ ఓటేసి ఓటర్లలో చాలా మందికి వీరి ముఖాలు తెలియవు.. ఈ లెక్కకు వస్తే టీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలా మంది అభ్యర్థులను చూసి కాకుండా కేసీఆర్‌ను చూసి ఓటేశారు.. అయితే ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయొద్దు.. చిన్న వయస్సులో వచ్చిన పెద్ద బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి... బాల్క సుమన్ ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందాలి... గాదరి కిశోర్ కూడా అసెంబ్లీలో ప్రజా సమస్యల కోసం కొట్లాడాలి...విద్యార్థుల సమస్యలను, యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గొంతెత్తాలి... రాజకీయాల్లో ఎన్ని రోజులు ఉన్నామన్నది ముఖ్యం కాదు.. నైతిక విలువలను పాటిస్తూ ఎన్ని రోజులు రాజకీయాలు చేశామన్నదే కీలకం.... అస్సాంలో విద్యార్థులంతా ఒక శక్తిగా మారి అస్సాం గణపరిషత్‌ను ఏర్పాటు చేసుకున్నారు.. ఇది నాలుగు దశాబ్దాల క్రితం ముచ్చట... నేరుగా విద్యార్థి నేతలు యూనివర్సిటీల నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు... ప్రఫుల్ల కుమార్ మహంతా లాంటి వాళ్లంతా అప్పుడు జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు.. అయితే దీన్ని ఎక్కువ రోజులు నిలుపుకోలేదు... అధికార దర్పం, అహంకారం, ఇతర వ్యసనాలకు గురై ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు.. ఈ అనుభవాలను గుర్తుంచుకోవాలి... వీరి జీవితాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి....!! |
1
Sunday, 21 September 2014
బాల్క సుమన్, గాదరి కిశోర్‌కు విజ్ఞప్తి....!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment