1

1

Sunday, 21 September 2014

మ‌ళ్లీ మొద‌టికొచ్చిన ప‌చ్చ ప‌త్రిక ఉద్యోగుల తొల‌గింపు క‌థ...

కార్మిక శాఖ క‌మిష‌న‌ర్ ఆదేశాలు బేఖాత‌రు...
బ‌ల‌వంత‌పు రాజీనామాలు ఆమోదించిన‌ట్లు సిబ్బందికి లేఖ‌లు...
అకౌంట్ల‌లో డ‌బ్బు జ‌మ చేసి సాగ‌నంపేందుకు సిద్ధ‌మైన యాజ‌మాన్యం...
మండిప‌డుతున్న సిబ్బంది... మరో పోరాటానికి సిద్ధ‌మంటూ సంకేతం...



ప‌చ్చ ప‌త్రిక‌లో సెక్యూరిటీ, ప్రాసెసింగ్‌, ఇంకొన్ని విభాగాల్లో దాదాపు 400 మందికిపైగా  ఉద్యోగుల‌తో బ‌ల‌వంతంగా చేయించుకున్న రాజీనామాలు చెల్ల‌బోవ‌ని తెలంగాణ కార్మిక శాఖ క‌మిష‌న‌ర్ ఆదేశాలు ఇచ్చిన‌ప్ప‌టికీ... ఆ సంస్థ యాజ‌మాన్యం దాన్ని తుంగ‌లోకి తొక్కింది... ఈ ఆదేశాలు మాకో లెక్కా అన్న‌ట్లుగా... య‌థావిధిగా ఉద్యోగుల తొల‌గింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తోంది... గ‌తంలో యాజ‌మాన్యం ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి బ‌ల‌వంతంగా రాజీనామా ప‌త్రాల‌పై సంత‌కాలు చేసిన సిబ్బందికి లేఖ‌లు పంపింది.. అందులో వారి రాజీనామాల‌ను ఆమోదించిన‌ట్లుగా... వారికి రావాల్సిన సొమ్మును బ్యాంకు ఖాతాలో జ‌మ చేస్తున్న‌ట్లుగా పేర్కొంది.. ఈ లేఖ‌లు చూసిన ఉద్యోగులు ఉలిక్కిప‌డ్డారు.. లేబ‌ర్ క‌మిష‌న‌ర్ ఆదేశాల‌ను ఉల్లంఘించ‌డం ఏంటని వాపోతున్నారు....

మొన్న యాజ‌మాన్యం దూత‌లు లేబ‌ర్ క‌మిష‌న‌ర్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసిన త‌ర్వాతే ఈ ప్ర‌క్రియ ఊపందుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి... ప్ర‌భుత్వాల‌ను మేనేజ్ చేయ‌డం, అధికారుల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డంలో ఆరితేరిన పెద్ద‌లు ఏమైనా చ‌క్రం తిప్పారా?   అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి....  ప్ర‌భుత్వాన్ని తొంగ‌దీసుకునేందుకే మెట్రోపై కుట్ర క‌థ‌నాల‌ను బాగా రంగ‌రించి రాసిన‌ట్లుగా కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు... మీరు మా ప్ర‌యోజ‌నాలు కాపాడితే.. మేం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కుట్ర క‌థ‌నాలు రాయ‌డం మానేస్తామ‌ని(ఒక ర‌కంగా క్విడ్ ప్రోకో వ్య‌వ‌హారం)  సందేశాలు పంపుతున్నార‌ని సిబ్బంది కొంద‌రు అంటున్నారు...
ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కార్మిక చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తూ తెలంగాణ ఉద్యోగుల పొట్ట‌ను కొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న యాజ‌మాన్యంపై ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప‌లువురు కోరుతున్నారు... లేనిప‌క్షంలో భ‌విష్య‌త్తులో తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లిగించేలా యాజ‌మాన్యం
వ్య‌వ‌హ‌రించ‌డం ఖాయ‌మ‌ని... వీళ్ల మాట‌ల‌ను న‌మ్మ‌డం అంటే గొర్రె క‌సాయిని న‌మ్మిన‌ట్లేన‌ని  హెచ్చ‌రిస్తున్నారు...


త‌మ మీడియా సంస్థ‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌భుత్వాల‌కు నీతి సూత్రాలు చెప్పే సంస్థ‌...  ఆ నీతి సూత్రాలు, నియ‌మాలు మాత్రం ప‌ట్ట‌వ‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం..  జ‌ర్న‌లిస్టు సంఘాలు, కార్మిక శాఖ మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డిగారు ఉద్యోగుల‌కు న్యాయం చేయాల‌ని వాళ్లంతా వేడుకుంటున్నారు...!!

No comments:

Post a Comment