ప్రియమైన తెలంగాణ ఎంఎస్‌వోలారా...
గత మూడు నెలలుగా మీరు తెలంగాణ సమాజానికి చేసిన మేలును జీవితంలో మరచిపోలేం... తెలంగాణ సమాజం మనోధైర్యాన్ని కోల్పోయేలా కథనాలు ఇచ్చే ఛానెళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసి మీరు మహోపకారం చేశారు... తెలంగాణ ఉద్యమ సమయంలో నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ఆంధ్రా మీడియాను వాడుకుని తప్పుడు ప్రచారం చేస్తున్న సమయంలో అక్కడ లోకల్ ఎంఎస్‌వో కుల్దీప్ సహానీ గారు తొలిసారిగా కొన్ని ఆంధ్రా మీడియా సంస్థల ప్రసారాలను ఆపేశారు.. ఆంధ్రా ప్రభుత్వ హయాంలో అది ఎంతో సాహసోపేతమైన చర్య.. పాపం అప్పట్లో బీజేపీ వాళ్లకు కూడా అది నచ్చింది... అయితే అదంతా గతం...అప్పట్లో అవి చేసిన తప్పులను క్షమించాలని నిండు మనసుతో అనుకున్నాం.. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విషం చిమ్మాలని చూసిన మీడియా సంస్థల ప్రసారాలను నిలిపివేసిన మీకు నా సెల్యూట్... ఒక కేబుల్ టీవీ వీక్షకుడిగా మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను... ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికే అధిక గౌరవం ఉంటుంది... మీరు ఆ రెండు ఛానెళ్ల ప్రసారాలను నిలిపేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల రేపు మీకు ఏదైనా సమస్య వస్తే నేను, నా కుటుంబం మీకు అండగా ఉంటుంది... మీ పక్షాన చేసే ప్రతీ పోరాటానికి సంఘీభావం తెలుపుతాం... మీ వెంట నిలుస్తాం.. మీరు చట్టాలను అతిక్రమిస్తున్నారని, నిరంకుశంతో వ్యవహరిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.. కానీ నాకు తెలిసినంత వరకు మీరు తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు... భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న దుర్మార్గుల ఆటకట్టిస్తున్నారు... మీ పోరాటం న్యాయమైనది.. మీరు కోట్ల మంది వినియోగదారుల ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందుకెళ్తున్నప్పుడు ఏ చట్టాలు మీ జోలికి రావు...
ఒక విజ్ఞప్తి....
మీడియా స్వేచ్ఛ గురించి కొందరు కుహానా మేధావులు గగ్గోలు పెడుతున్నారు... రెండు ఛానెళ్ల ప్రసారాలు ఆగిపోతే...అందులోనూ తెలంగాణ వార్తలను చూపించని, తెలంగాణ సమాజాన్ని గౌరవించని ఛానెళ్ల ప్రసారాలు నిలిపేస్తే ప్రపంచానికి ఏదో ఉపద్రవం వచ్చినట్లు గాయిగాయి చేస్తున్నారు.. నేనూ భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తాను.. తెలంగాణలో రెండు ఛానెళ్ల ప్రసారాలను నిలిపేశారుకదా... వాటి స్థానంలో కర్ణాటక, గుజరాత్, బెంగాలీ, అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన ఛానెళ్ల ప్రసారాలను ఇవ్వండి.. దేశంలో ఉన్న అన్ని ఛానెళ్లు, ప్రపంచంలో ఉన్న అన్ని ఛానెళ్ల ప్రసారాలు ఇవ్వండి... కానీ ఆ రెండు ఛానెళ్ల ప్రసారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పునరుద్ధరించొద్దు... నేను(తెలంగాణ సమాజం) ప్రపంచంలోని అన్ని టీవీ ఛానెళ్ల ప్రసారాలను చూసేందుకు సిద్ధంగా ఉంది కానీ మమ్మల్ని అవమానిస్తూ, మాపై నిత్యం మానసిక దాడి చేసే ఆ ఉన్మాద ఛానెళ్ల ప్రసారాలను చూసేందుకు సంసిద్ధంగా లేను.... !!
జై తెలంగాణ... జై జై తెలంగాణ...
No comments:
Post a Comment