1

1

Sunday 21 September 2014

మ‌న గుండెకాయ‌లో మ‌నం పాగా వేయాలి

May 17, 2014

మ‌న‌తో క‌లిసే ముందు... క‌లిసిన త‌ర్వాత‌... విడిపోయే ముందు... విడిపోయిన త‌ర్వాత కూడా.... సీమాంధ్రుల క‌న్ను హైద‌రాబాద్‌పైనే. మ‌రి తెలంగాణ బ‌లం.. బ‌ల‌హీన‌త కూడా ఇదే. ఎందుకో తెలుసా...?. ఈ చారిత్ర‌క న‌గ‌రం క‌చ్చితంగా మ‌న పూర్వీకుల శ్ర‌మ‌తో వెలిసింది. కానీ దానిని అప్ప‌నంగా సీమాంధ్రుల వ‌శం చేశాం. చివ‌ర‌కు ఇది మా న‌గ‌రం... మా గుండెకాయ అని గ‌గ్గోలు పెట్టాల్సి వ‌చ్చింది. అయినా కేంద్రం అనేక ఆంక్ష‌ల‌తో మ‌న గుండెల‌పై ఆంక్ష‌ల కుంప‌టి పెట్టింది. అందుకే వీటిని తొల‌గించాలంటే క‌చ్చితంగా మ‌న గుండెలో తెలంగాణాన్ని పూర్తిగా నింపాలి. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌తి సీమాంధ్రుడు టీఆరెస్‌కు న‌గ‌రంలో రాజ‌కీయ బ‌లం లేనందున ఇక్క‌డ వాదం లేద‌ని మొరిగారు. కానీ నిన్న‌టి ఎన్నిక‌ల‌తో దానిని కొంత‌మేర ప‌టాపంచ‌లు చేయ‌గ‌లిగాం. కారు 20 శాతం వ‌ర‌కు ఓట్ల‌ను సాధించ‌డంతో మ‌న గుండె ప‌దిలంగా ఉంద‌నే భ‌రోసా వ‌చ్చింది. ఇదే ఉత్సాహంతో టీఆరెస్ మ‌రో ఆరు నెల‌ల్లో వ‌చ్చే గ్రేట‌ర్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై ఇప్ప‌టినుంచే దృష్టిసారించాలి. ముఖ్యంగా సీమాంధ్ర న‌కిలీ ఓట్లను తొల‌గించి, ప్ర‌క్షాళ‌న చేయాలి. లేకుంటే మున్ముందు గుండెలాంటి మ‌న హైద‌రాబాద్ మ‌నుగ‌డ‌కు ప్ర‌మాద‌మే. నిన్న‌టి ఎన్నిక‌ల్లో ల‌క్ష‌లాది మంది తెలంగాణ ఓట‌ర్లు వారి గ్రామ‌ల‌కు వెళ్లి ఓట్లు వేశారు. దీంతో ఇక్క‌డ మ‌న ఓట్లు ల‌క్ష‌ల్లో త‌గ్గాయి. ఈకార‌ణంగానే మ‌ల్కాజిగిరి లోక్‌స‌భ స్థానం మ‌న చేజారింది. కానీ సీమాంధ్రులు మాత్రం ఇక్క‌డ టీడీపీకి ఓట్లు వేశారు. వారం రోజుల త‌ర్వాత అక్క‌డికి వెళ్లి మ‌ళ్లీ టీడీపీకి ఓట్లు వేశారు. ఈ ప‌రిణామం మ‌న‌కు హెచ్చ‌రిక లాంటింది. అందుకే తెలంగాణ‌వాదులారా... మీమీ చుట్టుప‌క్క‌ల ఉన్న సీమాంధ్ర బోగ‌స్ ఓట్ల‌పై స‌మాచారాన్ని క్రోడీక‌రించండి. మ‌రికొన్ని రోజుల్లో దీనిపై అంద‌రం ఓ ఉద్య‌మంలా బోగ‌స్‌, ఇక్క‌డ ఉండ‌ని వారి ఓట్ల తొల‌గింపున‌కు ప్ర‌య‌త్నం చేద్దాం. మ‌న గుండెలో మ‌న ఇంటి పార్టీని నిల‌బెట్టేందుకు న‌డుం బిగిద్దాం.

No comments:

Post a Comment