1

1

Sunday 21 September 2014

ఆంధ్రా మీడియాకు విజ్ఞ‌ప్తి...

May 23, 2014
జూన్ 2 త‌ర్వాత మీరు క‌చ్చితంగా తెలంగాణ‌కు, ఆంధ్రాకు వేరువేరు ఛానెల్స్‌, ప‌త్రిక‌లు పెట్టండి... ఒకే ఛానెల్‌లో రెండు ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం చేస్తామ‌నుకోవ‌డం వృథా... ఒక రాష్ట్రంలోనే రెండు ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గ‌న‌ప్పుడు ఒక ఛానెల్‌లో రెండు ప్రాంతాల వార్త‌ల‌కు స‌మ‌న్యాయం జ‌ర‌గ‌డం అసాధ్యం... అందుకే ఛానెల్స్‌లోనూ విభ‌జ‌న చేయాలి.. మీ ఛానెల్స్ యాంక‌ర్లుగా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ వారిని, ఆంధ్రా ప్రాంతానికి ఆంధ్రా వారిని పెట్టండి.... మీ ఛానెల్స్‌పై మానిట‌రింగ్‌కు క‌మిటీ ఏర్పాటు కానుంది... ఎన్ని నిమిషాలు తెలంగాణ‌కు, ఎన్ని నిమిషాలు ఇత‌ర వార్త‌లకు కేటాయించారో చూస్తాం.... అలాగే ప‌త్రిక‌ల్లోనూ తెలంగాణ ఎడిష‌న్ల‌లో చంద్ర‌బాబు బొమ్మ‌లు ఎక్కువ‌గా క‌నిపించినా కూడా స‌హించ‌బోం... తెలంగాణ ఎడిష‌న్లో తెలంగాణ నేత‌ల బొమ్మ‌లే ఉండాలి.... తెలంగాణ వార్త‌లే ఉండాలి.. తూర్పు గోదావ‌రిలో వ‌ర్షానికి పంట న‌ష్టం వార్త‌లు మాకొద్దు.. మా క‌రీంన‌గ‌ర్ గోస.. వ‌రంగ‌ల్ రైతు వేద‌న‌... ఖ‌మ్మం ఆదివాసీ వ్య‌థ‌లు ఉంటే స‌రిపోతుంది...
మీరు విభ‌జ‌న చేయ‌కుంటే మీకు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు రావు... నిషేధం ఉంటుంది... ఇది గుర్తుంచుకోండి.. మీ విలేక‌రుల‌కు అక్రిడేష‌న్లు ఇవ్వ‌రు..
మీ ఉద్యోగుల‌కు ఇళ్ల స్థ‌లాల్లో వాటా ద‌క్కదు.. అందుకే మీ ఛానెల్స్‌లోనూ విభ‌జ‌న జ‌ర‌గాలి.. ఈ ప్రాంత ఉద్యోగుల‌కు పెద్ద పోస్టులు ఇవ్వాల్సిందే...

నోట్‌: ఉస్మానియాలో ఆందోళ‌న జ‌రిగితే తెలంగాణ ఉద్యోగుల‌ను పంపేవారు.. ఎందుకంటే టియ‌ర్ గ్యాస్ షెల్స్ త‌గిలితే తెలంగాణ ఉద్యోగికే తాకుతుంది క‌దా అని.. అదే ఇప్పుడు కేసీఆర్ సీఎం అవుతున్నాడ‌ని తెలిసి ఆంధ్రా ఉద్యోగుల‌ను పంపే చ‌ర్య‌లు చేయొద్దు... ఆంధ్రా ఛానెల్‌లో ఆంధ్రాళ్ల‌ను పెట్టండి... అక్క‌డి ప‌రిస్థితులు వారికే తెలుస్తాయి.. తెలంగాణ ఛానెల్‌లో తెలంగాణోళ్ల‌ను పెట్టండి... స్థానిక ప‌రిస్థితులు స్థానికుల‌కే తెలుస్తాయి...

No comments:

Post a Comment