ఎఫ్‌డీఐ... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి.... దీనికి మోడీ గారిని నిర్వచనం... ఫస్ట్ డెవలప్ ఇండియా.... బాగుంది.. కానీ...
ఇదే ఎఫ్‌డీఐని కాంగ్రెస్ వాళ్లు పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నప్పుడు... అందరూ సైలెంట్‌గా లేరు... ఎందుకు?
అసలు స్వదేశీ జాగరణ్ మంచ్ ఎక్కడికి పోయింది...
స్వదేశీ వస్తువులు వాడాలి.. విదేశీ వస్తువులను బహిష్కరించాలన్న నినాదాన్ని వదిలేశారా? లేక ఆ సంస్థను కూడా మూసేశారా?
ఏది ఏమైనా 1992లో పీవీ నరసింహారావు సంస్కరణలు చేస్తున్న సమయంలో స్వదేశీ వస్తువులు వాడాలి.. స్వదేశీ అంటే దేశభక్తి అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు... నాకు తెలిసి రామజన్మ భూమి అంశం తర్వాత వాళ్లు పైకి తెచ్చిన అంశం దేశభక్తి.. స్వదేశీ వస్తు వినియోగ ఉద్యమం..
కానీ ఆ మాటలన్నీ ఏమయ్యాయి... పీవీ నరసింహారావు సంస్కరణలే దేశానికి దిక్కని గుర్తించారా? కాంగ్రెస్ బాటలో పయనిస్తున్నారా?
No comments:
Post a Comment