ఒక ఉదాహరణ....
కట్నం తీసుకున్న వాడు గాడిద.. చెప్పుతో కొట్టాలి...
ఈ స్లోగన్ ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఈ మాటలను అన్న మీడియా సంస్థను ఇప్పటి వరకు ఎవరం ఏమీ అనలేదు... ఇందులో మనకు బూతు, దుర్భాష కనిపించలేదు...
అయితే ఇవే మాటలను ఒకవేళ కేసీఆర్ అంటే... ఈ మీడియా సంస్థలు దీన్ని పెద్ద వివాదాస్పద అంశంగా మార్చుతాయి...
అవి కేసీఆర్ అన్న మాటను యథాతథంగా ఇవ్వవు...
"వాడు గాడిద... చెప్పుతో కొట్టాలి".. అని కేసీఆర్ అన్నట్లు వార్తను ఇచ్చి... చూశారా.. వాడిని కేసీఆర్ గాడిద అన్నాడు.. చెప్పుతో కొట్టాలి అంటూ దుర్భాషలాడుతున్నాడు అంటూ గగ్గోలు పెడతాయి... ఇదేం భాష కేసీఆర్ ..? అంటూ నిలదీస్తాయి... జాతీయ స్థాయిలో అర్నాబ్ గోస్వామి, రాజ్‌దీప్ సర్దేశాయి, ఇంకా ప్రజా సమస్యలు పట్టించుకోని జర్నలిస్టులెవరైనా ఢిల్లీలో ఉంటే వారితో ఒక చర్చ పెట్టించి... ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాలి...? ఏ పదాలు వాడాలి... ఏ పదాలు వాడొద్దు... అంటూ నీతులు చెప్పించి మళ్లా వాళ్ల మీడియా సంస్థల్లోనే వార్తలు ప్రచురించుకుని పబ్బం గడుపుతాయి.... ఈ తరహా జర్నలిజాన్ని చూస్తే జాలేస్తుంది..!!!
నేను చెప్పింది తప్పో.. ఒప్పో మీరే డిసైడ్ చేయాలి...!!
JAALI GEELI JAANTHA NI......ILANTI MEDIA NI 10KM LA LOTHU LO PAATHEREYYALSINDHEY ANNA.....
ReplyDelete