1

1

Saturday, 13 September 2014

ఆ క్రీడాకారుల‌ను ఆదుకున్న‌ది నిజం కాదా?

ఈ మ‌ధ్య సానియా మిర్జాకు కేసీఆర్ న‌జ‌రానా ఇస్తే కొంద‌రు విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. మ‌రి నిజంగా కేసీఆర్ ఒక్క సానియాకే ఇచ్చారా?   ఎవ‌రెస్టు ఎక్కిన చిన్నారుల‌కు న‌జ‌రానా ఇవ్వ‌లేదా?   కోచ్ హేమ‌ల‌త‌కు ఆర్థిక సాయం చేయ‌లేదా?   కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వం సైనా నెహ్వాల్‌ను తెలంగాణ అంబాసిడ‌ర్‌గా పెట్టుకొని ఆమె ఒలింపిక్స్ గెలిచిన‌ప్పుడు రూ.50 ల‌క్ష‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించి మ‌ర‌చిపోతే.. ఆ సొమ్మును కేసీఆర్ ప్ర‌భుత్వం ఇవ్వ‌లేదా?   గ‌గ‌న్ నారంగ్‌కు కూడా గ‌త ప్ర‌భుత్వం రూ.25 ల‌క్ష‌లు ఇచ్చి మ‌ర‌చిపోతే తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చింది క‌దా.. ఆగ‌స్టు 15న వీరంద‌రికీ ఇచ్చింది నిజం కాదా?   వీళ్లంతా తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడాకారుల‌ను బాగా ప్రోత్స‌హిస్తోంద‌ని అన్న మాట‌లు అవాస్త‌వ‌మా?
నిన్న‌టికి నిన్న పుల్లెల గోపీచంద్ కూడా పీవీ సింధుతో క‌లిసి కేసీఆర్‌తో భేటీ అయి తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడాకారుల‌ను బాగా ఆదుకుంటోంద‌ని అన్న మాట అవాస్త‌వ‌మా?


అదే స‌మ‌యంలో పొరుగు రాష్ట్రాల్లో క్రీడాకారుల‌ను ఇలా ఆదుకుంటున్న ప్ర‌భుత్వాలు క‌నిపిస్తున్నాయా?  మ‌రి ఎందుకు ఈ విప‌రీత ప్ర‌చారం...
అదంతా ఎందుకు... హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో  ఇంజినీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయిన‌ప్పుడు.. వారి కుటుంబాల‌కు రూ.5 ల‌క్ష‌లు ఆర్థిక‌సాయం చేస్తాన‌న్నా చంద్ర‌బాబునాయుడు ఆ సొమ్ము ఇవ్వ‌లేద‌ని బాధిత కుటుంబాలు అడిగితే ఏ ప‌త్రికా రాయ‌లేదు ఎందుకు?  ఆ సొమ్ము ఇచ్చారా?  ఇస్తారా?  ఇస్తే ఎప్పుడిస్తార‌ని అడ‌గ‌లేదు ఎందుకో... ?



ఇంకో విష‌యం.. తెలంగాణ అమ‌ర‌వీరుల‌కు ఇచ్చిన ప‌రిహారం సానియాకు ఇచ్చిన న‌జ‌రానాతో పోల్చితే త‌క్కువ అన్న విమ‌ర్శ ఉంది.. అమ‌రుల‌ను కించ‌ప‌రిచార‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.. అయితే అమ‌రుల‌కు ఇచ్చిన ప‌రిహారం త‌క్కువే అన్న‌ది నిజ‌మే.. అయితే అమ‌రుల త్యాగం వెల క‌ట్ట‌లేనిది...  అమ‌రుల‌కు తెలంగాణ‌లో గుడి క‌ట్టినా త‌క్కువే...
అయితే ఈ విష‌యం ఆలోచించ‌త‌గిన‌దే.. ఎందుకంటే ప్ర‌పంచ‌క‌ప్‌, ఇంకేదో క‌ప్ గెలిచిన క్రికెట‌ర్ల‌కు రూ.20 కోట్లు, రూ.10 కోట్లు అంటూ కోట్లు కుమ్మ‌రిస్తాయి ప్ర‌భుత్వాలు... మ‌రి కార్గిల్ యుద్ధం, ముంబ‌యి దాడులు, పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌వాదులు దాడులు చేసిన‌ప్పుడు దేశాన్ని ర‌క్షించే క్ర‌మంలో అమ‌రులు అయిన వారికి చాలా త‌క్కువ మొత్తంలో ప‌రిహారాలు ఇస్తాయి...  ఈ ప‌ద్ధ‌తి మారాలి...  దేశం, ప్రాంతం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి ముందు ఎవ‌రైనా త‌క్కువే.. !!

అలాగే క్రీడ‌ల్లో కేవ‌లం టెన్నిస్‌, క్రికెట్ క్రీడాకారుల‌కే గుర్తింపు ఉంటోంది.. హాకీ, ఇత‌ర క్రీడాకారుల‌కు కూడా స‌ముచిత గౌరవం ద‌క్కాలి... ఇందుకోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాలి.. 

No comments:

Post a Comment