1

1

Saturday, 20 September 2014

కేసీఆర్ గారూ... తెలంగాణ వాసుల‌కు ద‌స‌రా క‌ష్టాలు త‌ప్పించ‌రూ..!

కేసీఆర్ గారూ... తెలంగాణ వాసుల‌కు ద‌స‌రా క‌ష్టాలు త‌ప్పించ‌రూ..!
తెలంగాణ జిల్లాల బ‌స్సుల‌ను ఎంజీబీఎస్ నుంచే న‌డిపించండి...
స‌మైక్య రాష్ట్రంలో ప‌డ్డ ఇక్క‌ట్ల‌ను దూరం చేసిన ప్ర‌జాభిమానాన్ని పొందండి...


తెలంగాణ రాష్ట్రంలో ద‌స‌రా అతి పెద్ద పండ‌గ‌... ఈ పండ‌గ‌కు హైద‌రాబాద్‌లో ఉన్న, ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అంద‌రు తెలంగాణ వాళ్లు సొంత ఊళ్ల‌కు ప్ర‌యాణం అవుతారు..  స‌మైక్య రాష్ట్రంలో ఆంధ్రా పాల‌కులు తెలంగాణ ప్ర‌యాణికుల‌ను రోడ్డున ప‌డేశారు... తెలంగాణ‌లోని వివిధ జిల్లాల‌కు వెళ్లాల్సిన బ‌స్సుల‌ను శివారు ప్రాంతాల నుంచి న‌డిపారు.. ఫ‌లితంగా వ‌రంగ‌ల్ వెళ్లే వాళ్లు అర్ధ‌రాత్రి ఉప్ప‌ల్ రోడ్డుపై ప‌డిగాపులు గాయ‌డం, క‌రీంన‌గ‌ర్ వెళ్లే వాళ్లు రాత్రిపూట‌ జూబ్లీ బ‌స్టాండ్‌లో అష్ట‌క‌ష్టాలు ప‌డ‌టం జ‌రిగేది... ఇక రంగారెడ్డి, నిజామాబాద్ వెళ్లే తెలంగాణ ప్ర‌యాణికుల‌దీ ఇదే అవ‌స్థ‌.. అర్థ‌రాత్రి రోడ్ల‌పై అర‌కొర బ‌స్సుల‌తో పడ్డ ఇక్క‌ట్లు, ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. తెలంగాణ రాష్ట్రం వ‌స్తే ఈ క‌ష్టాలు తొలుగుతాయ‌ని, మ‌న బ‌స్సులు ఎంజీబీఎస్ నుంచి న‌డిచే రోజు వ‌స్తుంద‌ని ఎంద‌రో ప్ర‌యాణికులు చ‌ర్చించుకున్న సంఘ‌ట‌న‌ల‌ను క‌ళ్లారా చూశాను..

అదే స‌మ‌యంలో ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే బ‌స్సుల కోసం ఎంజీబీఎస్‌ను వాడుకునే వాళ్లు... ఎంజీబీఎస్‌కు అర్ధ‌రాత్రి కూడా సిటీ బ‌స్సులు న‌డిచేవి...
జూబ్లీ బ‌స్టాండ్‌, ఉప్ప‌ల్ బ‌స్టాండ్‌కు మాత్రం సిటీ బ‌స్సులే క‌ర‌వ‌య్యేవి... ఇవ‌న్నీ స‌మైక్య పాల‌న‌లో పండ‌గ‌ల స‌మ‌యంలో మ‌నం ప‌డ్డ క‌ష్టాలు..
కానీ ఇప్పుడు మ‌న రాష్ట్రం మ‌న‌కు వ‌చ్చింది.. మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది.. ముమ్మాటికీ మ‌న బ‌స్సుల‌న్నీ ఎంజీబీఎస్ నుంచే న‌డ‌వాలి.. మ‌న రాష్ట్ర ప్ర‌యాణికుల ప్ర‌యోజ‌నాల‌క‌కు ప్రాధాన్యం ఇవ్వాలి..

వీలైతే ఆంధ్రా ప్రాంత బ‌స్సుల‌ను శివారు నుంచి న‌డిపించేలా ఆదేశాలు ఇవ్వండి.. ఇప్పుడు ఆర్టీసీ వేరు ప‌డింది.. మీరు ఎంజీబీఎస్ నుంచి ఆంధ్రా బ‌స్సులు న‌డిపేలా చూస్తే వ‌చ్చే ఆదాయ‌మంతా ఆంధ్రా ఆర్టీసీ ఖాతాలోకి వెళుతుంది.. మ‌న ఆర్టీసీ బాగు ప‌డాలంటే మ‌న ప్ర‌యాణికుల‌కే పెద్ద‌పీట వేయాలి.. వారి అసౌక‌ర్యాల‌ను దూరం చేయాలి..  మీరు తీసుకునే ఈ నిర్ణ‌యం ల‌క్ష‌ల మంది తెలంగాణ ప్ర‌యాణికుల మ‌న్న‌న‌లు పొందేదిగా ఉంటుంది...  ఆంధ్రా పాల‌న‌కు, తెలంగాణ పాల‌న‌లో మ‌న‌కు క‌లిగిన ప్ర‌యోజ‌నాన్ని  ప్ర‌జ‌లు గుర్తుంచుకుంటారు... అలాగే త‌గిన‌న్ని బ‌స్సుల‌ను కేటాయించండి... ఈ సారి ద‌సార పండ‌గ, బ‌క్రీద్ కూడా క‌లిసి వ‌స్తున్న‌ట్లు ఉన్నాయి... ఫ‌లితంగా ఐదారు రోజుల వ‌రుస సెల‌వులు వ‌స్తుండ‌టంతో సొంత ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల ర‌ద్దీ కూడా ఎక్కువే ఉంటుంది.. వీట‌న్నింటినీ గుర్తుంచుకొని తెలంగాణ ప్ర‌యాణికుల‌కు మేలు క‌లిగేలా, ఆర్టీసీకి లాభం చేకూరేలా మీ నిర్ణ‌యం ఉండాలి..  పండ‌గ స‌మ‌యంలో ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేసేలా ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు రూపొందించండి...
ఈ విష‌యంపై సంబంధిత మంత్రి, అధికారుల‌తో మీరే చ‌ర్చించి త‌గిన నిర్ణ‌యం తీసుకోండి...

నోట్‌: ఆంధ్రా ప్రాంత వాసుల కోసం ప్ర‌త్యేక రైళ్లు,  ప్రైవేటు ట్రావెల్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి.. తెలంగాణ ప్ర‌యాణికుల‌కు ఆ వెసులుబాట్లు లేవు... అందుకే వారి కోసం మీరు చొర‌వ తీసుకొని వీలైన‌న్ని ఎక్కువ బ‌స్సులు న‌డిపేలా చూడండి.. వీలైతే ప్ర‌యాణ ఛార్జిలు కొంచెం పెంచినా న‌ష్టం లేదు..

No comments:

Post a Comment