అసలు క్రీడలు మనకెందుకండీ...
భారత క్రీడాకారులు ఓడిపోవాలి.. ఖజానాలో సొమ్ములు మిగిలిపోవాలి...
భారత క్రీడాకారులు ఓడిపోవాలి.. ఖజానాలో సొమ్ములు మిగిలిపోవాలి...
ఛీ... ధోని టీం భారత్‌కు ప్రపంచ కప్‌ను ఎందుకు తీసుకొచ్చింది...?
మన కర్మ కొద్ది వాళ్లు ప్రపంచకప్‌ను గెలిచినందుకు మన ఖజానాలో రూ.100ల కోట్లు లూటీ అయ్యాయి..
మన కర్మ కొద్ది వాళ్లు ప్రపంచకప్‌ను గెలిచినందుకు మన ఖజానాలో రూ.100ల కోట్లు లూటీ అయ్యాయి..
ఛీ వాళ్లు ప్రపంచ కప్ గెలవకుంటే బాగుండేది.. అనవసరం వాళ్లకు డబ్బులు ఇచ్చారు.. నజరానాలు ఇచ్చారు.. కొందరికి పురస్కారాలు ఇచ్చారు.. భారత రత్నలు ఇచ్చారు..
ఫస్ట్ రౌండ్‌లోనే భారత్ ఓడిపోయి ఇంటికి వచ్చి ఉంటే ఖజానాకు వందల కోట్లు ఆదాయ అయ్యేవి కదా...
ఇక్కడ భారత్ ఓడిపోయినా పర్వాలేదు... కానీ మన డబ్బు మిగిలేది కదా...
పుల్లెల గోపీచంద్ అప్పట్లో బ్యాట్మింటన్ టోర్నీ గెలవకపోతే బాగుండు.. ఆయనకు గచ్చిబౌలిలో కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వం ధారాదత్తం చేసేది కాకుండే... ఖజానాకు డబ్బు మిగిలి ఉండేది...
అప్పట్లో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన షూటర్ గెలవాల్సింది కాకుండే.. అనవసరంగా ఆయనకు కోట్ల రూపాయాలు ఇచ్చారు...
అసలు ఈ క్రీడాకారులెవరూ ఏ టోర్నమెంట్ లోనూ గెలవొద్దు.. భారత క్రీడాకారులు అన్ని క్రీడల్లోనూ ఓడిపోవాలి.. మనకు ఎవరూ పతకాలు తేవొద్దు.. అనవసరంగా ఖజానా లూటీ కావొద్దు...
మీరేం అంటారు... అసలు క్రీడా మంత్రిత్వ శాఖనే రద్దు చేద్దాం... క్రీడలకు నిధులొద్దు... క్రీడాకారులకు సన్మానాలొద్దు.. పురస్కారాలొద్దు.. రివార్డులొద్దు...
మళ్లా చైనా వాడు అన్ని గెలిచాడు.. అమెరికా వాడు ఇన్ని గెలిచాడు.. చిన్న దేశం కెన్యాకు కూడా ఒలింపిక్స్‌లో స్వర్ణం వచ్చింది... మన దగ్గర సన్నాసులు ఉన్నారా? అంటూ తిట్టుకోవడాలూ వద్దు...
No comments:
Post a Comment