కేసీఆర్ వ్యాఖ్యలపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసిన జస్టిస్ కట్జూ గారికి కృతజ్ఞతలు...
అలాగే మీడియా వ్యవహరిస్తున్న తీరుపైనా కమిటీలు ఏర్పాటు చేయండి...
పక్షపాతంతో కూడిన, అర్థసత్యాలతో కూడిన వార్తలను ఇస్తున్న యాజమాన్యాలను ఏం చేయాలో మీరే తేల్చండి...
మీడియా సంస్థల్లో జర్నలిస్టుల దయనీయ పరిస్థితుల అధ్యయనంపైనా కమిటీని ఏర్పాటు చేయండి...
కేసీఆర్ మీడియాను బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు జస్టిస్ మార్కండేయ కట్జూ కమిటీని వేశారు... ఇది మంచి పరిణామమే.. కేసీఆర్ అన్న వాస్తవ వ్యాఖ్యలు తెలుసుకోవడానికి ఇది అవకాశం... అలాగే తెలంగాణ పౌరులకు విజ్ఞప్తి... ఈ కమిటీకి తెలంగాణలో మీడియా వ్యవహరిస్తున్న తీరును కూడా మేధావులు వివరించాలి... దేశంలో మీడియా ఛానెళ్లు, పత్రికల పక్షపాత ధోరణితో కూడిన వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యలపై ఆధారాలతో నివేదిక ఇవ్వాలి... మీడియా నిజస్వరూపాన్ని కమిటీ ద్వారా దేశం మొత్తానికి తెలిసేలా చేయాలి... లేకపోతే ఇవి ఇలాగే రెచ్చిపోతాయి... చివరకు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే లాగా... అవి వ్యవహరిస్తాయి... వీలైతే భారత ప్రెస్ కౌన్సిల్ ఒక కమిటీని ఏర్పాటు చేసి మీడియా వ్యవహార శైలి ఎలా ఉందో కూడా తేల్చాలని విజ్ఞప్తి... అలాగే మీడియా సంస్థల్లో కార్మిక చట్టాల ఉల్లంఘనపై కమిటీని ఏర్పాటు చేసి విచారించాలి... జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తున్న మీడియా యాజమాన్యాలను ఎలా శిక్షించాలో మీరే సెలవు ఇవ్వాలి...!!
No comments:
Post a Comment