తెలంగాణ ఈనాడు పత్రిక ఎడిషన్లో దాదాపు 40 నుంచి 50 శాతం ఆంధ్రా రాష్ట్ర వార్తలే.. మరి ఆంధ్ర రాష్ట్ర ఎడిషన్లలో ఎన్ని తెలంగాణ వార్తలుఉంటున్నాయి...? ప్రతి రోజు తెలంగాణ ఎడిషన్లో కేసీఆర్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ, మరి ఆంధ్ర ఎడిషన్లో ఇద్దరి బొమ్మలు వస్తున్నాయా?
ఇంకో విచిత్రం ఏంటంటే ఆంధ్ర ప్రభుత్వం రాజధాని కోసం నిధులు అడిగితే మన వద్ద పేజీ వార్త వేశారు... ఇదెందుకు..? మన ప్రభుత్వం కేంద్రాన్ని నిధులు అడిగితే ఆంధ్రా ఎడిషన్లో వార్త వస్తలేదు ఎందుకు?
ఎవరో గంటా సుబ్బారావు అట.. ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ తెలంగాణ ఎడిషన్లో వేశారు.. మరి తెలంగాణ ప్రభుత్వం ఎవరినైనా నాలెడ్జ్ హబ్‌కు ఛైర్మన్‌గానో నియమిస్తే ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆంధ్రాకు వేస్తారా?
ఆంధ్రా మొదటి పేజీ నిండా ఆంధ్రా వార్తలే ఉంటాయి.. మరెంటో తెలంగాణ మొదటి పేజీలో ఆంధ్రా వార్తలు, తెలంగాణ వార్తలు సమానంగా కనిపిస్తున్నాయి...!!
అడిగే వాళ్లు లేనంత వరకూ ఇవి కొనసాగుతాయి.... అందుకే ఈ ప్రశ్నాస్త్రాలు...!!
No comments:
Post a Comment