1

1

Monday, 15 September 2014

థాంక్ గాడ్‌... దేవుడికి నిజంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నా....!!!



దేశంలో బాంబు దాడుల‌తోనే బీభ‌త్సం సృష్టించొచ్చ‌ని ఉగ్ర‌వాదులు భావిస్తూ వ‌స్తున్నారు.. కానీ మీడియా అనుమ‌తులు పొంది ప్ర‌భుత్వాల‌ను అస్థిర ప‌రిచేలా క‌థ‌నాలు రాయొచ్చ‌ని... రాయించొచ్చ‌న్న ఆలోచ‌న వారి మ‌దిలో రాన్న‌ట్లు ఉంది... మీడియా ద్వారా విద్వేషాలు రెచ్చ‌గొట్టొచ్చ‌ని వారికి తెలియ‌న‌ట్లు ఉంది...

మామూలుగా ప్ర‌భుత్వాన్ని తిడితే కేసులు ఉంటాయ‌ని.. అదే మీడియా ముసుగులో ప్రాంత ప్ర‌జ‌లు, దేశ ప్ర‌జ‌లు, దేశాన్ని పాలించే వారిని, న‌చ్చ‌ని వారిని ఎవ‌రినైనా ఏ భాష‌లోనైనా తిట్టిపోసే హ‌క్కు ల‌భిస్తుంద‌ని వారికి తెలియ‌లేదేమో...  బ‌హుషా వాళ్ల‌కు మ‌న భాష రాదు క‌దా... వ‌చ్చి ఉంటే ఎప్పుడో వాళ్ల మ‌నుషుల‌తో మీడియా అనుమ‌తులు పొంది ర‌క్త‌పాత ర‌హిత ఉన్మాదాన్ని(ఉగ్ర‌వాద‌న్ని)  దేశంలో పెంచిపోషించే వారేమో...ఇంకా ఇది జ‌ర‌గ‌నందుకు సంతోషం.. !!

No comments:

Post a Comment