1

1

Thursday, 18 September 2014

ప‌చ్చ ప‌త్రిక‌లో క‌న్నుమూసిన మ‌రో ఉద్యోగి....!!

బ‌ల‌వంత‌పు రాజీనామాతో మాన‌సిక ఒత్తిడి...
వారం రోజులుగా ఆసుప‌త్రిలో మృత్యువుతో పోరాటం..

ప‌చ్చ ప‌త్రిక‌లో మ‌రో దారుణం.... యాజ‌మాన్యం వేధింపుల‌తో మాన‌సిక ఒత్తిడికి గురైన ప్రాసెస్ సెక్ష‌న్‌ ఉద్యోగి మృత్యు పోరాటంలో ఓడిపోయాడు.. గ‌త వారం రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ఈ రోజు తుదిశ్వాస విడిచాడు... గ‌త నెల 28వ తేదీన‌ యాజ‌మాన్యం ఆయ‌న‌తో బ‌ల‌వంతంగా రాజీనామా చేయించుకుంది.. అంద‌రు ఉద్యోగుల మాదిరిగానే ఆయ‌న కూడా గ‌త్యంత‌రం లేక‌ రాజీనామా ప‌త్రాల‌పై సంత‌కాలు పెట్టాడు.. ఉద్యోగం పోతే కుటుంబ పోష‌న‌, భ‌విష్య‌త్తు ఏమిట‌న్న బెంగ‌తో ఆయ‌న రోజూ మ‌థ‌న పడ్డారు.. ఇద్ద‌రు కుమార్తెల‌కు పెళ్లి చేసిన‌ప్ప‌టికీ ఇంటి ఖ‌ర్చులు, అప్పులు ఎలా తీర్చ‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌లు ఆయ‌ను వెంటాడాయి... రాజీనామా చేసిన వారికి రూ.2 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ‌గా ఇచ్చేది లేద‌ని యాజ‌మాన్యం తేగేసి చెప్ప‌డంతో ఏం చేయాలో తెలియ‌క‌, ఎవ‌రికి చెప్పుకోలేక కుమిలిపోయాడు... చివ‌ర‌కు వారం క్రితం ఆయ‌న ఆసుప‌త్రిలో చేరారు.. మాన‌సిక ఒత్తిడి విప‌రీతంగా ఉంద‌ని వైద్యులు ధ్రువీక‌రించారు... బ‌ల‌వంత‌పు రాజీనామాతో దిగులు చెంది అనారోగ్యానికి గురై మ‌ర‌ణించిన ఉద్యోగి కుటుంబానికి త‌గిన న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఉద్యోగులు కోరుతున్నారు...

ప‌త్రిక‌ల్లో ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్టులు, నాన్ జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితులు అత్యంత ద‌య‌నీయంగా ఉన్నాయ‌న‌డానికి ఇది మ‌రో ఉదాహ‌ర‌ణ‌... సంస్థ ఎదుగుద‌ల‌కు శ‌క్తివంచ‌న లేకుండా ప‌నిచేసిన ఉద్యోగుల‌ను నిర్దాక్షిణ్యంగా తొల‌గించ‌డం వ‌ల్లే ఈ దారుణం చోటుచేసుకుంది.. ఏది ఏమైనా బాధిత కుటుంబానికి స‌ముచిత ప‌రిహారం ఇచ్చి ఆదుకోవాలి... !

నోట్‌: ఈ బ‌ల‌వంత‌పు రాజీనామాలు చెల్ల‌వ‌ని తెలంగాణ కార్మిక శాఖ ఈ నెల 12న ఆదేశాలు ఇచ్చింది.. అయితే అప్ప‌టికే ఆ ఉద్యోగి ఆరోగ్యం క్షీణించడం గ‌మ‌నార్హం....

1 comment:

  1. ప్రజలకు న్యాయసూత్రాలు వల్లించే పత్రికాధిపతులు తమ పత్రిక అభ్యున్నతికి కృషి చేసే వాళ్లని నలిపి వెయ్యటం యెంత ఘోరం?!

    ReplyDelete