రజాకార్ల అరాచకాల నుంచి తెలంగాణకు భారత ప్రభుత్వం విమోచన కల్పించింది... భారత సైన్యం నిజాం సంస్థానంపై యుద్ధం చేసింది.. ఆ తర్వాత తెలంగాణ భారత్‌లో విలీనం అయింది.. సైనిక చర్య ద్వారా జరిగిన ఈ విలీన ప్రక్రియ సబబే అని మనం బలంగా నమ్ముతున్నాం... !!!
మరి కాశ్మీర్‌లోని కొంత భాగాన్ని సైన్యం సహకారంతో పాకిస్థాన్ వేరు చేసింది.. మనమేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం.. వాళ్లేమో ఆజాద్ కాశ్మీర్ అంటారు... పాకిస్థాన్ సైన్యం సహకారంతో ఆక్రమణకు గురైన(పాక్ కోణంలో చూస్తే ఆజాదీ పొందిన) కాశ్మీర్ పాక్‌లో విలీనం కావడం సబబే అవుతుందా?
అలాగే అరాచకాలు జరుగుతున్న ప్రాంతంలోని ప్రజలకు ఇంకో దేశం సైనిక చర్య ద్వారా విమోచన కల్పించి విలీనం చేసుకోవడం మంచి పరిణామమేనా...
ఒకవేళ ఇది మంచిదే అంటే... ఈశాన్య భారతంలో, జమ్మూకాశ్మీర్‌లో సైనిక బలగాల ప్రత్యేక అధికార చట్టం వల్ల అరాచకాలకు గురవుతున్న ప్రాంతాల రక్షణ కోసం ఇంకేదైనా దేశం ముందుకొస్తే ఎలా స్పందించాలి?
చైనా ఆక్రమించుకున్న భారత భూభాగంపై మనం ఆశలు వదులుకోవాల్సిందేనా...? ఇక దాన్ని మన భూభాగం అనుకోవద్దా?
ఒకవేళ సంస్థానాల ఆక్రమణ వేరు, దేశాల ఆక్రమణ వేరు అన్న సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? ప్రజాస్వామ్య దేశాల జోలికి వెళ్లొద్దు.. రాచరిక, నియంతృత్వ రాజ్యాలను కబ్జా చేసుకున్నా తప్పు లేదన్న ఫిలాసఫీ ఎవరైనా రూపొందించారా?
ఇంకా చాలా సందేహాలున్నాయి.. !!
No comments:
Post a Comment