- పోటీపడి తెలంగాణ సర్కారుపై విషం చిమ్ముతున్న పచ్చ పత్రికలు
- ఎల్ అండ్ టీని మరో ప్రాజెక్టుతో ప్రలోభపెడుతున్న నాయుళ్లు
- ఆ కోణంలోనే ఒకేరోజు రెండు పత్రికల్లో మెట్రోపై దుమారం
చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ. గత రెండ్రోజులుగా హైదరాబాద్‌కు మణిహారంగా మారనున్న మెట్రో రైలుపై వరుస కథనాలతో కుట్రలను పారిస్తున్నారు. ఎల్అండ్‌టీ లేఖ రాసింది... మేం దాన్ని ప్రచురించాం... ఇప్పుడు ఆ రెండు కమ్మ, పచ్చ పత్రికలు ఇచ్చుకునే వివరణ ఇదే. కానీ దీని వెనక పెద్ద కథ ఉంది. భారీ కుట్ర దాగి ఉంది. నాకు తెలిసి, చాలామంది నుంచి సేకరించిన వివరాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను.
- ఆంధ్రజ్యోతి పత్రిక తెలంగాణ స్వపరిపాలన మొదలుపెట్టినప్పటి నుంచే మెట్రో రైలుపై కుట్రలు మొదలుపెట్టింది. కారణం... మెట్రో పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలే మారతాయి. మరి ఏపీ అసలు రాజధాని లేకుండా కునారిల్లుతున్న సమయంలో ఇక్కడ ఏకంగా మెట్రో అందుబాటులోకి వస్తే.. చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ వచ్చినా నయాపైసా పెట్టుబడి ఆంధ్ర రాజధానికి వెళ్లదు. అందుకే ఎలాగైనా మెట్రోకు అవరో్ధాలు కలిగించి, ప్రాజెక్టును నిలిపివేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా చాలా కథనాలు వడ్డి వార్చారు. కానీ జనం నమ్మడం లేదు. కనీసం ఒక్క గంట కూడా పనులు ఆగిన దాఖలాలు లేవు. ఈ విషయం రాధాకృష్ణకు కూడా తెలుసు. కానీ జనాలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు గ్లోబెల్స్ ప్రచారంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని రాధాకృష్ణ చూస్తున్నాడు. చంద్రబాబు, వెకయ్యనాయుడు ఆయన్ని ఉసిగొల్పడంతో పాటు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. రేపు విజయవాడలో ఆంధ్రజ్యోతి కార్యాలయం అన్ని హంగులతో ఏర్పడేందుకు వీరు ఆర్థికంగా సహకరించేందుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకు ప్రతిఫలంగా హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీయడం, కేసీఆర్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం.
- ఇక ఈనాడుది విచిత్ర పరిస్థితి. నిన్నా మొన్నటి దాకా అసలు మెట్రో రైలు మీద ఆ పత్రికలో ఒక్క నెగెటివ్ వార్త ఎవరైనా చూశారా?. మీకో విషయం చెప్పాలి... ఈనాడులో మెట్రో చూసే రిపోర్టర్లు, ఇన్‌ఛార్జిలు ఎవరూ ఒక్క నెగెటివ్ వార్త కూడా రాయరు. అందుకు ఎండీ కిరణ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కనీసం మెట్రో కోసం చెట్లు కొడుతున్నారు అని సమాచారం కోసం వార్త రాసినా... కోప్పడిన సందర్భాలున్నాయి. అదో పెద్ద ప్రాజెక్టు... కొన్ని ఇబ్బందులుంటాయి. పట్టించుకోవద్దు... అనేది ఈనాడు పెద్దల హితోపదేశం. కానీ మరి ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు ఈ అడ్డగోలు కథనం వచ్చింది?. దీని వెనకా అనేక కారణాలున్నాయి. ఎందుకంటే రాజగురువింద ఏ కారణం, లాభంలేనిది ఈనాడు బ్యానర్‌ను వృథా చేయడు కదా.
- వాస్తవంగా మెట్రో రెండో దశలో ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి మెట్రో మార్గం వెయాలనే ప్రతిపాదన గతంలోనే రాజగురువింద మెదడులో పుట్టింది. ఆదిలోనే ఈ సమాచారాన్ని తన రిపోర్టర్ ద్వారా ఎన్వీఎస్ రెడ్డికి చేరవేశారు. ఆయన సానుకూలంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కారు వచ్చింది. ఇలాంటి బట్టెబాజి వేషాలు చెల్లవు. అందుకే అప్రధాన్యమైన ఆ మార్గం ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదు. దీన్ని ధృవీకరించుకున్న తర్వాతే ఇన్నాళ్లూ పాజిటివ్‌గా ఉన్న ఈనాడు ఒక్కసారిగా మెట్రో ప్రాజెక్టుకు నెగెటివ్‌గా మారింది.
-దీనికి తోడు చంద్రబాబుకు మేలు జరుగుతుందంటే రాజగురువిందకు పరోక్షంగా మేలు జరిగినట్లే కదా. అందుకే మెట్రో ప్రతిష్ఠను దెబ్బతీయాలని పూనుకున్నాడు. అందులో ఆంధ్రజ్యోతితో కలిసి కుట్రను మొదలుపెట్టాడు. పైగా కొన్నిరోజుల కిందట ఈనాడులోని కార్మికులు ఉద్యోగభద్రత కోసం కార్మిక శాఖను ఆశ్రయిస్తే న్యాయం చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇందులో కేసీఆర్‌కు ప్రమేయం లేకున్నా... మా జోలికొస్తే ఇలాంటి అడ్డగోలు కథనాలు రాస్తామని హెచ్చరించేందుకే ఈనాడు మెట్రో కథను బ్యానర్ చేపింది.
- నిజానికి ఎల్అండ్‌టీ రాసిన లేఖను మేం ప్రచురించామని ఆ పత్రికలు వివరణ ఇస్తాయి. కానీ అసలు ఆ కంపెనీ గతంలో అనేకసార్లు ఇలాంటి లేఖలు ఎన్నో రాసింది. ఇదేం కొత్తకాదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నపుడు కూడా రాసింది. కానీ ఏనాడూ అవి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు బ్యానర్ కథనాలుగా మారలేదు. ఇప్పుడు కేసీఆర్ సీఎం కాంగనె వాళ్లకు జర్నలిజం గుర్తకొచ్చింది. సాధారణంగా ప్రతి కంపెనీ ప్రాజెక్టులు చేసేందుకు ముందుకొస్తాయి.... ఆపై మార్కెట్లో సిమెంటు, స్టీలు రేట్లు పెరగ్గానే లాభం తగ్గుతుందంటూ గగ్గోలు పెడతాయి. ఈ విషయం ఈనాడులో మెట్రోపై బ్యానర్ కథనం రాసిన రిపోర్టర్కు తెలియనది కాదు. ఎందుకంటే ఆయన జల(ధన)యజ్ఙానికి సజీవ సాక్ష్యం కదా. (కాకపోతే ఎల్అండ్‌టీ లేఖను తెచ్చినాయన వేరే. ఆయన తన పేరు బయటికి రాకుండా జాగ్రత్త పడుతుండటం వెనక పెద్ద కథే ఉందనుకోండి)..
ఇలా ఇకముందు కూడా ఎల్అండ్‌టీ అనేకసార్లు కూడా లేఖ రాస్తుంది. కానీ ఉన్నపలంగా ఇన్ని వేల కోట్లు పెట్టి ఏ కంపెనీ అయినా వెనక్కి తగ్గుతుందా?. ఒకవేళ తగ్గితే అంతర్జాతీయ ప్రాజెక్టులు చేసే ఎల్అండ్‌టీ పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్లో ఎలా ఉంటుందో వారికి తెలియదా?. ఇలాంటి లేఖల ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా ఊరట కలిగించేందుకు ఏమైనా వెసులుబాట్లు ఇస్తుందనేది వారి ఆశ. అంతమాత్రాన దాన్ని పట్టుకొని పచ్చ పత్రికలు కావాలని రాద్దాంతం చేస్తున్నాయి.
- ఇక ఎల్అండ్‌టీ విషయానికొస్తే... ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసిన కంపెనీ ఇలా అడ్డగోలుగా వ్యవహరించదు. కానీ అందుకు విరుద్ధంగా లేఖలు రాయడం వెనక నాయుళ్ల ఒత్తిడి ఉంది. హైదరాబాద్‌లోనిది పీపీపీ ప్రాజెక్టు. ముందు డబ్బులు పెట్టి ఆతర్వాత సంపాదించుకోవాలి. కానీ విశాఖపట్నంలోగానీ, విజయవాడలోగానీ చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టును ఇలా కాకుండా నేరుగా ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టాలని చూస్తున్నారు. అంటే నయాపైసా లేకుండా ఉన్న పరికరాలు, యంత్రాలతో అక్కడికి వెళితే ప్రభుత్వ నిధుల ద్వారా పనులు కానీయొచ్చు. ఈ అవకాశాన్ని ఎల్అండ్‌టీకి ఇస్తామని వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే హైదరాబాద్ మెట్రోను దెబ్బతీసి... దుకాణం అక్కడికి మర్చాలనే ఆలోచన కూడా ఎల్అండ్‌టీలో లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడైతే డబ్బులు పెట్టాలి. కానీ అక్కడైతే కేంద్రం నుంచి నిధులు వస్తే పనులు చేయొచ్చు. పైగా గతంలో వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి లెక్క కేసీఆర్ ఇష్టానుసారంగా మెట్రో మాటున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానంటే ఊరుకోడు. ఒప్పందం ప్రకారం నీ లెక్క చూసుకొని లాభం తీసుకో అంటడు. అందుకే ఇక్కడ తన పాచికలు పారవని గుర్తించిన ఎల్అండ్‌టీ అయిష్టంగానే పని చేస్తుందనేది బహిరంగ రహస్యం. కాకపోతే ఒప్పందం చేసుకున్న తర్వాత సచ్చినంక పని చేయాలిగానీ ఇలా లేఖలతో పనులు జరుగుతయా?. ఇంకోటి... ఎల్అండ్‌టీ తన లేఖలో 2007లో తాము హైదరాబాద్ యూటీ అవుతుందని అనుకున్నం. కానీ కాలేదని, అందుకే లాభం తగ్గుతందని అన్నరు. అంటే వీళ్లకు 2007లోనే రాష్ట్రం విడిపోతుంది, హైదరాబాద్‌ను యూటీ చేస్తరని ఎవరు చెప్పిండ్రు?. అంటే కావాలని కొందరు వెనక ఉండి ఎల్అండ్‌టీతో ఇదంతా రాపిస్తున్నరు. దీని ఆంతర్యం ఇప్పుడు హైదరాబాద్‌ను యూటీ చేస్తే మెట్రో ఎల్అండ్‌టీ లాభసాటి ప్రాజెక్టుగా మారుతుందట. బేవకూఫ్ ఆలోచన కాకుంటే ఏంది ఇది. అవతల మంచి ఆఫర్ ఉంది కనుకనే ఇలాంటి మడతపేచీలు పెట్టి... తెలంగాణ ప్రభుత్వంతో అంతరం పెంచుకొని... బిచాణా ఆంధ్రాకు ఎత్తేయాలనే ఆలో్చన కూడా ఎల్అండ్‌టీకి ఉండొచ్చు కాబోలు. ఎందుకంటే నాయుళ్ల అలా ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఆసరాగా తీసుకొని... ఇద్దరు నాయుళ్లు, రామోజీ, రాధాకృష్ణ ఈ ప్రాజెక్టును భ్రష్టుపట్టించాలని కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తుంది.
No comments:
Post a Comment