1

1

Wednesday, 17 September 2014

విలీనంపై వెన‌క‌డుగు స‌రికాదు..

100 రోజుల పాల‌న‌లో ప్ర‌జాభిప్రాయానికి అనుగుణంగానే ఎన్నో నిర్ణ‌యాలు తీసుకున్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వం... తెలంగాణ విలీన దినాన్ని నిర్వ‌హించే విష‌యంలో వెన‌క‌డుగు వేయ‌డం మంచి ప‌రిణామం కాదు.. ఎందుకంటే 60 ఏళ్లుగా ఆంధ్రా పాల‌కులు ఈ రోజును విస్మ‌రించారు.. ఆంధ్రా ప‌త్రిక‌లు, మీడియా కూడా ప‌ట్టించుకోలేదు... ఆంధ్రా పార్టీలు సెప్టెంబ‌రు 17 ప్రాధాన్యాన్ని గుర్తించ‌లేదు... సాయుధ పోరాటానికి ఉన్న చ‌రిత్ర‌ను ప్ర‌పంచం గుర్తించింది.. అయితే ఈ పోరాటంలో భాగ‌స్వాములు కాని వాళ్లు కూడా రెచ్చిపోతున్న త‌రుణంలో ప్ర‌భుత్వం మౌనంగా ఉండ‌టం స‌రికాదు...
తెలంగాణ అన్న పేరు ఉచ్చ‌రించ‌డానికి సిద్ధ‌ప‌డ‌ని వాళ్లు కూడా ఈ రోజు స‌ర్కారుపై విరుచుకుప‌డే అవ‌కాశం ఇచ్చి త‌ప్పు చేశారు... వ‌చ్చే ఏడాది నుంచైనా స‌రే తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని విజ్ఞ‌ప్తి.. భార‌త్‌లో తెలంగాణ‌ విలీనం అయిన దినానికి ప్రాధాన్య‌త ఉంటుంది... భార‌త ప్ర‌జాస్వామ్యంలో మ‌న‌కు న్యాయం జ‌రిగిందా? ఆల‌స్యంగా న్యాయం జ‌రిగిందా? అన్న‌ది త‌ర్వాత ముచ్చ‌ట‌... కానీ ప్ర‌జాస్వామ్యంలో భాగ‌స్వామ్యుల‌మైన‌ రోజుకు ఉన్న ప్రాధాన్య‌త‌ను గుర్తించాలి..!!

No comments:

Post a Comment