తెలంగాణ కార్టూనిస్టు శ్రీధర్ గారి పేరును పద్మశ్రీకి సిఫార్సు చేయడం మంచి విషయమే... ఆయన ప్రతిభను టీడీపీ ప్రభుత్వం గుర్తించింది.. రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడుకుంటే తెలుగు పత్రికల్లో కార్టూన్ పేరు వింటే గుర్తొచ్చే పేరు శ్రీధర్(నా వరకైతే).. మోహన్ గారు బాగానే కార్టూన్లు వేశారని విన్నా..కానీ నేను ఎక్కువగా చూడలేదు...
శ్రీధర్‌గారు తన కార్టూన్లతో ఎన్నో సంక్లిష్టమైన సమస్యలను సులువుగా పాఠకులకు అర్థమయ్యేలా వ్యంగ్య చిత్రాలు వేశారు.. వైఎస్ జగన్, రాజశేఖరరెడ్డిపై కొన్నిసార్లు జుగుప్సాకరమైన కార్టూన్లు వేసి ఉండొచ్చు గాక.. తెలంగాణ ఉద్యమం విషయంలోనూ ఆయన కుంచె కదలక పోవచ్చు.. చంద్రబాబుపై అంత ఘాటైన కార్టూన్లు వచ్చాయో లేదా నాకు తెలియదు... అయితే వాటికి గల ప్రత్యేక కారణాలు మనకు తెలుసు.. వీటన్నింటినీ విస్మరించి విశాల దృక్కోణంలో చూస్తే ప్రతిభావంతులైన శ్రీధర్ గారి పేరు ప్రతిపాదించడం ఆహ్వానించదగిన విషయమే.. !!
No comments:
Post a Comment