ఉప ఎన్నికల ఓటమిల నుంచి బీజేపీ తేరుకునేనా?
నేడు ఉప పోరు ఫలితాలు....
నేడు ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి... దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.. ఇందులో మోడీ రాజీనామా చేసిన వడోదరా, కేసీఆర్ రాజీనామా చేసిన మెదక్ కూడా ఉన్నాయి.. అయితే వడోదరాలో బీజేపీ గెలుపు, మెదక్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ.. మెజారిటీ ఎంత అనే దానిపైనే పందెలు కడుతున్నారు.. మోడీకి వడోదరాలో రికార్డు స్థాయిలో దాదాపు 5.9 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది.. ఇక మెదక్‌లో కేసీఆర్‌కు 3.9 లక్షల మెజారిటీ వచ్చింది.. ఇప్పుడు ఆయా పార్టీల తరఫున పోటీ చేసిన వారు ఈ రికార్డులను బద్దలు కొడతారా? అన్నది వేచిచూడాలి... అయితే ఓటింగ్ శాతం తగ్గడం వల్ల మెజారిటీ కూడా తగ్గొచ్చని పలువు రు పేర్కొంటున్నారు..
మరోవైపు ఇటీవల ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలు చవిచూసిన బీజేపీ.. ఈ సారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటుతామని ధీమాగా ఉంది.. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, సమాజ్‌వాదీ మధ్యే పోటీ ఉంటుందని అంచనా.. ఏది ఏమైనా మరో 8 గంటల్లో ఫలితాల సరళి తెలిసిపోతుంది...
No comments:
Post a Comment