నోట్: ఇది మొన్నటి వార్త....మీడియా గొడవలో పడి దీన్ని ఎవరమూ అంతగా పట్టించుకోలేదు.... చాలా ఆలోచించాల్సిన విషయం...
అదే విధానమా?
ప్రభుత్వంరంగానికి మంగళమేనా?
నవరత్న కంపెనీలైన ఓఎన్‌జీసీ, కోల్ఇండియా, సెయిల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ దేనికి సంకేతం...
బొగ్గు, చమురే ప్రధాన ఇంధనాలు.. వీటిని ప్రైవేటుకు పెడితే భవిష్యత్తు ఏంటి?
ఈ విషయాన్ని హైలెట్ చేయకుండా కేవలం ఖజానాకు డబ్బు వస్తుందన్న రీతిలో పత్రికలు ఎందుకు కప్పిపుచ్చుతున్నాయి...
ఆధార్‌పై రాద్ధాంతం చేసిన పెద్దమనుషులు ఇప్పుడు దాన్ని కొనసాగించాలనుకుంటున్నది ఎందుకు?
రైల్వే ఛార్జీలు పెంచొద్దన్న వాళ్లు స్వయంగా పెంచారెందుకు?
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకమన్న వాళ్లు...స్వయంగా ఎర్రతివాచీలు పరుస్తున్నారు కారణం ఏంటి?
నిజంగా ప్రభుత్వానికి డబ్బు సమీకరణ కావాలనుకుంటే... 2జీ కుంభకోణంలో కొట్టేసిన 1.7 లక్షల కోట్లను దొంగల వద్ద నుంచి కక్కించొచ్చు కదా.. బొగ్గు కుంభకోణంలో మింగిని సొమ్మును అవినీతి పెద్దల నుంచి రాబట్టొచ్చు కదా... కామన్వెల్త్ అక్రమార్జనను స్వాధీనం చేసుకోవచ్చు కదా...
విదేశాల నుంచి నల్లధనాన్ని తెప్పిస్తే దేశం తలరాత మారి... ప్రజలకు తలా లక్ష చొప్పున పంచొచ్చు అని వారే సెలవిచ్చారు కదా... !!
ఈ పనులు చేయకుండా... లాభాల్లో ఉన్న అతి కీలకమైన ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటే నష్టం ఎవరికి?
దయ చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే ప్రతిపాదనలు చేయకండి... మొన్న మీరు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వాళ్లు తీసుకుని ఉంటే ఈ పాటికి మీడియా రచ్చ చేసేది.. కానీ ఇప్పుడు ఖజానా నిండుతోందన్నట్లు కథనాలు వస్తున్నాయి.... అది ఎలా నిండుతోంది.. అన్నది జనానికి తెలియాలి కదా..!!
No comments:
Post a Comment