1

1

Friday, 12 September 2014

నా దృష్టిలో ప్ర‌తి తెలంగాణ నెటిజెన్ కూడా అక్రిడియేష‌న్ కార్డు లేని జ‌ర్న‌లిస్టే....!!

ఇన్నేళ్లు ఎన్నో మీడియా సంస్థ‌లు ఎన్నెన్నో చూయించాయి.. కొన్ని సంస్థ‌లైతే మ‌న మాట‌ విన‌లేదు.. మ‌న భావాల‌ను ప‌ట్టించుకోలేదు.. కాంటెంట్ వారిదే.. జ‌డ్జిమెంట్ వారిదే.. మ‌నం వీక్ష‌కులం.. కొన్ని సంద‌ర్భాల్లో  బ‌ఫూన్లం మ‌న‌మే... మ‌రి అదే వీక్ష‌కుడు విలేక‌రిగా మారితే త‌ట్టుకోలేక‌పోతున్నారు ఈ సంప్ర‌దాయ న‌యా జ‌ర్న‌లిస్టులు కొంద‌రు...(అంద‌రు కాదు కొంద‌రు మాత్ర‌మే)...
ప్ర‌శ్నిస్తే గిశ్నిస్తే మేమే ప్ర‌శ్నించాల‌న్న‌ట్లు ద‌బాయిస్తున్నారు... మేం ఎవ‌రికీ స‌మాధానం చెప్ప‌బోం.. మాకే అంద‌రూ జ‌వాబులివ్వాలంటూ రుబాబు చేస్తున్నారు...  మ‌నం అచ్చ తెలుగులో.. బూతులు లేని తెలుగులో... ఎలాంటి అతిశ‌యోక్తులు లేకుండా..గ్రాఫిక్స్ మాయాజాలం లేకుండా.. గ్లామ‌ర్ లేని  సిటిజ‌న్ జ‌ర్న‌లిజం ద్వారా మ‌న‌ భావాల‌ను పంచుకుంటే స‌హించ‌లేక‌పోతున్నారు... ! మా మాట‌ల్లో బూతులున్నాయా?  అంటే జ‌వాబుండ‌దు.. మా రాత‌ల‌లో అశ్లీల‌త ఉందా అంటే నోరు క‌ద‌ల‌దు... !!
ఇన్నేళ్లు త‌మ ప్రొగ్రామ్స్‌ను మౌనంగా భ‌రించిన వ్య‌క్తులు వారి స్వేచ్ఛ‌ను ఉప‌యోగించుకుంటే ఇంతగా త‌ట్టుకోలేక‌పోతున్నారంటే... ఇన్నేళ్లు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తూ అత్యంత జుగుప్సాక‌రంగా, హీనంగా, నీచంగా, బూతుల‌ను వాడుతూ రాసిన, చేసిన ప్రోగ్రామ్‌ల‌ను జ‌నం ఎట్లా త‌ట్టుకున్నారో మీరే ఆలోచించాలి.. మీరే తీర్పు చెప్పాలి... విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం అంటూ సొంత క‌విత్వాన్ని జొప్పించిన సంద‌ర్భాల‌పై ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి!!
స్వేచ్ఛ అంద‌రికీ స‌మాన‌మే... అంద‌రూ ప‌రిమితితో కూడిన స్వేచ్ఛ‌ను అనుభ‌వించాలి అన్న‌దే నా ఆకాంక్ష‌...  !! ప‌రిమితి దాటితే... ప్ర‌జాస్వామ్యంలో దేవుళ్లు అయిన ప్ర‌జ‌లు.. మూల‌స్తంభాల‌ను కూల్చేసినా ఆశ్చ‌ర్యం లేదు...!!!

No comments:

Post a Comment