ఏ మీడియా అని అడగకండి...
2009 డిసెంబరు 9 వరకు ఉన్న మీడియా..
2009 డిసెంబరు 10 నుంచి ఉన్న మీడియా..
2009 డిసెంబరు 9 వరకు కేసీఆర్ వ్యక్తిత్వాన్ని చంపాలని(క్యారెక్టర్ అసాసినేషన్) చూసిన మీడియాను చూశాం... ఇంకా చాలా చూశాం...
ఇక డిసెంబరు 10 తర్వాత వ్యక్తిపై కన్నా సమాజంపై జరిగిన దాడి మనకు కనిపిస్తుంది...
నిజామాబాద్‌లో తెలంగాణ కోసం ఒకతను చనిపోతే.. మరణ వాంగ్మూలం ఇస్తే ఓ ప్రధాన ఛానెల్ ఆయన ఆర్థిక సమస్యలతో చనిపోయాడని ప్రచారం చేసిన వైనాన్ని చూశాం.. ఇలాంటివి చాలా ఉన్నాయి... డిసెంబరు 10 నుంచి ఇప్పటి వరకు ఆయా మీడియా సంస్థ ల వార్తలు, వీడియోలను విశ్లేషించాలి...(ఇది ఎప్పటి నుంచో నేను చేస్తున్న డిమాండ్).. ఎవరేమిటో తెలిసిపోతుంది.. తెలంగాణ ప్రెస్ అకాడమీ ఈ పనిని చేయాలి.. తెలంగాణ ఉద్యమకాలంలో మీడియా సంస్థల వ్యవహారశైలిపై ఒక లిఖితపూర్వక గ్రంథం ఉండాల్సిందే... లేకపోతే భవిష్యత్తు తరాలు మోసపోయే ప్రమాదంఉంది..
No comments:
Post a Comment