1

1

Monday, 13 July 2015

ఆ బ‌స్సుల్లో హిందువులు మాత్ర‌మే ఎక్కుతారా?

పుష్క‌రాల సంద‌ర్భంగా ప్ర‌త్యేక బ‌స్సులు వేస్తున్నారు క‌దా.. ఆ బ‌స్సుల్లో హిందువులు మాత్ర‌మే ఎక్కుతారా?
ముస్లింలు, క్రైస్త‌వులు ఎక్క‌రా? నిజామాబాద్‌లో దిగే ముస్లిం సోద‌రుడిపై పెంచి ఛార్జీల ప్ర‌భావం ఉండ‌దా?
అలాగే క్రైస్త‌వులపై బ‌స్సు భారం ప‌డ‌దా?
మ‌రి హిందువుల పుష్క‌రాల కోసం ప్ర‌త్యేక బ‌స్సులు వేసుకోవ‌డం, ఛార్జీలు పెంచ‌డం, దాన్ని త‌మ‌పై రుద్ద‌డం ఏంట‌ని వాళ్లంతా ఆందోళ‌న చేస్తే?
ఎక్క‌డ న‌డిచే బ‌స్సు అక్క‌డే న‌డిస్తే మ‌రి హిందూ భ‌క్తులు ఏం కావాలి...? పుష్క‌రాల‌కు ఎలా వెళ్లాలి..?
స‌మాజంలో ప్ర‌జ‌లు ప‌ర‌మ‌త స‌హ‌నంతో, సోద‌ర భావంతో క‌ల‌సి మెల‌సి ఉంటుండ‌టం వ‌ల్లే శాంతియుతంగా మ‌నం వినాయ‌క చ‌వితి చేసుకుంటున్నాం, రంజాన్ జ‌రుపుకుంటున్నాం, దీపావ‌ళి చేసుకుంటున్నాం, క్రిస్‌మ‌స్ జ‌రుపుకుంటున్నాం..!!

No comments:

Post a Comment