1

1

Thursday, 2 July 2015

జాతీయ స్థాయి పోటీ ప‌రీక్ష‌ల‌కూ మ‌న వారిని స‌న్న‌ద్ధం చేయాలి..

తెలంగాణ ప్ర‌భుత్వానికి ఓ విజ్ఞ‌ప్తి..
స్ట‌డీ స‌ర్కిళ్ల‌ను బ‌లోపేతం చేయండి..
ఈ-గ్రంథాల‌యాల‌ను అందుబాటులోకి తేవాలి..
జాతీయ స్థాయి పోటీ ప‌రీక్ష‌ల‌కూ మ‌న వారిని స‌న్న‌ద్ధం చేయాలి..
************
ఇప్ప‌టికైనా తెలంగాణ యువ‌తీ యువ‌కులు ఒక‌టి గుర్తుంచుకోవాలి... దేశంలోని కీల‌క స‌ర్వీసుల్లో తెలంగాణ ప్రాధాన్యం త‌క్కువ‌గా ఉంది.. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇత‌ర అన్ని స‌ర్వీసుల్లోనూ మ‌న వారు లేరు... మ‌న వాళ్లు ఎప్పుడూ గ్రూప్స్ రాస్తాం. తెలంగాణ‌లోనే ఉంటామ‌న్న భావ‌న‌లో ఉండిపోతున్నారు. లేక‌పోతే గ‌ల్ఫ్ పోతాం అంటారు.. బ్యూరోక్రాట్ వ్య‌వ‌స్థ‌లో మ‌న వాళ్లు ఎక్కువ మంది ఉంటే మ‌న‌కు చాలారంగాల్లో న్యాయం చేకూరే అవ‌కాశం ఉంది. కీల‌క నిర్ణ‌యాల స‌మ‌యంలో మ‌న‌కు జ‌రిగే అన్యాయాల‌ను నివారించేందుకు ఆస్కార‌మూ ఉంటుంది.. ఇది కేవ‌లం అఖిల భార‌త స‌ర్వీసు ఉద్యోగాల‌కే కాదండోయ్‌.. న్యాయ వ్య‌వ‌స్థ‌లోనూ మ‌న తెలంగాణ గ‌డ్డ నుంచి న్యాయ కోవిదుల ప్రాధాన్యం ఉండాల్సిందే.. న్యాయ వ్య‌వ‌స్థ‌లోనూ మ‌న వారు ఉంటే మ‌న‌కు అన్యాయాలు జ‌ర‌గ‌కుండా మేలు చేయ‌గ‌ల‌రు.. మ‌న న్యాయ‌మూర్తి న‌ర‌సింహారెడ్డి గారూ శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌లోని 8వదైన చీక‌టి అధ్యాయాన్ని వెలుగులోకి తెచ్చిన తీరు మ‌నం ఒక‌సారి గుర్తుకు తెచ్చుకోవాలి. అలాంటి వాళ్లు మ‌రింత మంది తెలంగాణ నుంచి త‌యారు కావాలి.. నీటి పారుద‌ల శాఖ‌, ఇంకేదైనా శాఖ అయినా స‌రే జాతీయ స్థాయిలో ఏ రంగ‌మైన స‌రే మ‌న ఉనికి క‌నిపించాలి.. ఇటీవ‌ల కాలంలో జాతీయ స్థాయి పోటీ ప‌రీక్ష‌ల నోటిఫికేష‌న్లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి.. వాటిపై దృష్టి కేంద్రీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. భ‌విష్య‌త్తులో కేంద్ర మంత్రిత్వ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, ఇత‌ర డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ప‌ద‌వుల్లో మ‌న వారు ఉంటే మ‌న‌కు చాలా వ‌ర‌కు మేలు చేకూరుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్ర‌భుత్వం అఖిల భార‌త స్థాయి పోటీ ప‌రీక్ష‌లకు మ‌న యువ‌త‌ను స‌న్న‌ద్ధం చేసేలా ఉన్న‌ స్ట‌డీ స‌ర్కిళ్ల‌ను మ‌రింత బ‌లోపేతం చేయాలి. మ‌రిన్ని ఎక్కువ స్ట‌డీ స‌ర్కిళ్ల‌ను ప్రారంభించాలి.. వీలైన‌న్ని ఎక్కువ గ్రంథాల‌యాల‌ను ప్రారంభించాలి.. విశ్రాంత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించాలి.. కేవ‌లం రాష్ట్ర ఉద్యోగాలే చేస్తాం అన్న భావ‌న‌ను మ‌న యువ‌త‌రం నుంచి దూరం చేయాలి. వారిలో క‌మ్యూనికేష‌న్ నైపుణ్యాలు పెంచాలి.. తెలుగు, హిందీ, ఉర్దూలో మ‌న వాళ్లు అద్భుతంగా మాట్లాడుతారు.. కేవ‌లం ఆంగ్లంలోనూ నిష్ణాతుల‌ను చేస్తే జాతీయ‌స్థాయిలో మ‌న స‌త్తాను నిరూపించొచ్చు.. అది రానున్న రోజుల్లో తెలంగాణ‌కు శ్రీ‌రామ ర‌క్ష‌గా నిలుస్తుంది..!!

1 comment: