ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అనుచితంగా మాట్లాడి ఉంటే ముమ్మాటికీ అది తప్పే.. దీనికి ఆయన క్షమాపణ చెప్పాల్సిందే.. పుష్కరాల్లో వీఐపీలైనా, సామాన్యులైనా ఒకటే.. అందులో కాన్వాయ్‌కి అడ్డుగా వాహనం వచ్చిందని ఆవేశానికి లోనుకావడం మంచిది కాదు.. వీలైతే పోలీసులకు మద్దతుగా ట్రాఫిక్ కంట్రోలింగ్ చేయాలి.. అసలే ఇరుకైన రోడ్లలో వీఐపీల మాదిరిగా తిరిగితే అందరికీ ఇబ్బందే కదా... తొలిసారి ఎన్నికైన వాళ్లు తమ సుస్థిర రాజకీయ భవిష్యత్ కోసం ఎంతో అనుకువగా, హుందాగా ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో జనం గుండెల్లో శాశ్వతంగా చోటుదక్కుతుంది.. దాదాపు 10 రోజులుగా ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా పుష్కరాలు సాగుతున్నాయి.. అలాంటప్పుడు చిన్న అంశం దొరికినా పతాక శీర్షికలో వేయడానికి ఎల్లో మీడియా కాచుకు కూర్చుంది.. మరి ఈ సమయంలో ఎంత సంయమనంతో ఉండాలో విజ్ఞత కలిగిన ఎమ్మెల్యే గారు ఆలోచించుకోవాలి... అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు క్షమాపణ చెబితే పరువేం పోదు.. అది గర్వకారణంగానే ఉంటుంది..
***************
గతంలో కేటీఆర్ పోలీసులపై దురుసుగా మాట్లాడి తర్వాత క్షమాపణ చెప్పాడు.. ఆంధ్రాలో పలువురు నేతలు ఇంతకన్నా పరుషంగా మాట్లాడారని సమర్థించుకోవడానికి ప్రయత్నించొద్దు.. ప్రశాంత్‌రెడ్డి గారు పోలీసులకు బేషరత్ క్షమాపణ చెబితే తెలంగాణ సమాజానికి అది గర్వకారణంగా నిలుస్తుంది..
No comments:
Post a Comment