1

1

Friday 3 July 2015

ఆయ‌న మౌన‌మోహ‌న్ సింగ్‌.. ఈయ‌న మౌన‌మోడీ గారు..

మ‌న్మోహ‌న్ నుంచి మోడీ గారు నేర్చుకున్న‌ది మౌన ముద్రేనేమో అనిపిస్తుంది...
వివాదాల‌పై నోరు మెద‌ప‌ని ప్ర‌ధానులు..
*************
మంత్రి కోసం స్టేష‌న్ నుంచి బ‌య‌లు దేరిన రైలును మ‌ళ్లా వెన‌క్కి ర‌ప్పిస్తారు...
మంత్రి కోసం విమానాన్ని ఆపుతారు..
మంత్రి కోసం విమానం నుంచి ప్ర‌మాణికుల‌ను దింపుతారు...
మంత్రి అగ్గిపెట్ట‌ను తీసుకొని విమానం ఎక్కినా ప్ర‌శ్నించ‌రు.. అగ్గిపెట్ట‌ను తీసుకెళ్ల‌డం నా హ‌క్కు అని అన్నా మాట్లాడ‌రు...
స్మృతి ఇరానీ, సుష్మా స్వ‌రాజ్‌, పంక‌జా ముండే, వ‌సుంధ‌ర‌ల వ్య‌వ‌హ‌రంలోనూ నోరు మెదప‌రు....
చూస్తుంటే మొన్నామ‌ధ్య మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌ను క‌లిసి మోడీ ఏం ఆర్థిక శాస్త్రాన్ని తెలుసుకున్నాడో తెలియ‌దు కానీ.. మౌన ముద్ర‌లో ఉండ‌టాన్ని బాగానే వంట‌ప‌ట్టించుకున్న‌ట్లు అవ‌గ‌తం అవుతోంది... మంత్రులు వివాదాల్లో ఇరుక్కుంటే మౌనంగా ఉండాల‌ని నేర్చుకున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది... !!

No comments:

Post a Comment