ఆల్ ద బెస్టు బాబు గారు..
అమరావతిని అతి తక్కువ సమయంలో నిర్మించాలని ఆకాంక్షిస్తున్నాను..
**********
నా మట్టుకైతే అమరావతి నిర్మాణం వీలైనంత త్వరగా మొదలు కావాలని ఆకాంక్షిస్తున్నా... ఆ నగరాన్ని సింగపూర్ నిర్మిస్తుందా? జపాన్ నిర్మిస్తుందా? లేక అమెరికా నిర్మిస్తుందా? అన్నది అనవసరం.. అది వారి అంతర్గత వ్యవహారమే... వచ్చే ఏడాది నాటికైనా ఆంధ్రా అసెంబ్లీ, సెక్రటేరియెట్ అక్కడికి తరలిపోవాలని కోరుకుంటున్నా.. ఒక్కొక్కటికీ అక్కడి తరలిపోతే ఇక అక్కడి నుంచే పాలన చేయాల్సి ఉంటుంది.. అక్కడ భవన నిర్మాణాలు పూర్తయినా హైదరాబాద్‌లో మకాం వేస్తే ఆంధ్రా ప్రజలు కూడా ఆగ్రహిస్తారు.. అక్కడే మకాం వేస్తే అక్కడి వారి గురించే ఆలోచిస్తారు తప్ప పొరుగు రాష్ట్రాల గురించి పెద్దగా పట్టించుకోరని నా భావన.. మనకూ ఓ పెద్ద బాధ నుంచి విముక్తి లభిస్తుంది.. లేకపోతే పక్కలో బళ్లెంలా.. ఇంటి పక్కనే గోతులు తీసే శత్రువుతో దినదినమూ అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలపైనే కన్నేసే పరిస్థితి ఉంటుంది.. దీని వల్ల ఇక్కడి ప్రజలకూ మేలు జరగదు.. అమరావతి కోసం చేపట్టిన భూ సేకరణ కొంత బాధించినప్పటికీ అమరావతికి భూమి పూజ చేసినప్పుడు సంతోషించాను.. అమరావతికి శంకుస్థాపన చేసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.. వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేసుకుని చంద్రబాబునాయుడు అండ్ కో గృహప్రవేశం చేయాలని కోరుకుంటున్నాను.. మీ రాజధానిని వీలైనంత త్వరగా పూర్తిచేసి మిమ్మల్ని త్వరగా అక్కడికి పంపేందు కోసం అమరావతి నిర్మాణంలో రాళ్లెత్తెందుకూ నేను రెడీ బాబు గారు.... ఆల్ ద బెస్టు... !

No comments:
Post a Comment