1

1

Friday, 17 July 2015

క‌మ్యూనిస్టుల కోట‌లో పారిశుద్ధ్య కార్మికుల కోసం స‌మ్మె చేసేది ఎవ‌రు?



మ‌న‌ది ధ‌నిక రాష్ట్ర‌మే.. మ‌న వ‌ద్ద ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల‌కు చెల్లిస్తున్న జీతాలు అధిక‌మే..
క‌మ్యూనిస్టు పార్టీలు గ‌గ్గోలు పెడుతున్న‌ట్లు ఇక్క‌డ కార్మికుల హ‌క్కుల‌ను ఎవ‌రూ కాల‌రాయ‌లేదు... ఇచ్చిన హామీ ప్ర‌కారం పాల‌కులు జీతాల‌ను పెంచుతున్నారు.. మ‌రి క‌మ్యూనిస్టు పాలిత ఏకైక రాష్ట్ర‌మైన త్రిపుర‌లో వామ‌ప‌క్షాలు స‌ఫాయి కార్మికుల‌కు ఎంత జీతం ఇస్తుందో తెలుసుకోవాల‌ని ఆస‌క్తి క‌లిగింది.. నిజంగానే క‌మ్యూనిస్టులు కార్మికుల ప‌క్ష‌పాతులే క‌దా.. క‌నీసం ఓ రూ.20 వేలో లేక రూ.15 వేల జీతాన్నో స‌ఫాయి కార్మికుల‌కు ఇస్తున్నారేమో అన్న అనుమానం మ‌న‌సులో ఉండే... ఒక‌సారి చూద్దామ‌ని వెబ్‌సైట్ చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాయి... అక్క‌డ రోజుకు రూ.180 వేత‌నాన్ని స‌ఫాయి కార్మికుల‌కు ఇస్తున్నార‌ట‌...
ఇక గ‌తేడాది అక్క‌డ కార్మిక శాఖ వెబ్‌సైట్లో నైపుణ్య‌వంతులైన కార్మికులు, కొంచెం నైపుణ్యం ఉన్న కార్మికుల‌కు, నైపుణ్యం లేని కార్మికుల ఇచ్చే క‌నీస వేత‌నాల‌ను చూస్తే ఆశ్చ‌ర్యం వేసింది... రూ.4 వేలు నైపుణ్యం లేని వాళ్ల‌కు, రూ.4400 కొంచెం నైపుణ్యం ఉన్న వారికి, ఇక నైపుణ్యులైన కార్మికుల‌కు రూ.4900 జీతం ఇస్తున్నారు...
అంగ‌న్వాడీ కార్య‌క్త‌ల‌కు ఇచ్చే గౌర‌వ‌వేత‌న‌మూ అంతంతే...
మ‌రి ఈ వామ‌ప‌క్ష నేత‌ల‌కు ఇత‌ర రాష్ట్రాల్లో ఇంత జీతం ఇవ్వాలి.. అంత జీతం ఇవ్వాల‌ని డిమాండ్లు పెడుతున్నారు క‌దా..
మ‌రి వాళ్లు పాలించే త్రిపుర‌లో ఇవే జీతాల‌ను అమ‌లు చేయ‌డం లేదు ఎందుకు?
త్రిపుర రాష్ట్రం దాకా ఎందుకు... మీ ప‌త్రిక‌లైన మ‌న తెలంగాణ‌, న‌వ తెలంగాణ‌, ప్ర‌జాశ‌క్తి, విశాలాంధ్ర‌లో మ‌జిథియా వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సులు అమ‌లు చేయండి చాలు... ఆ త‌ర్వాత ఎన్నైనా స‌మ్మెలు, బంద్‌లు చేసుకుని చావండి బాబు..!!

No comments:

Post a Comment