60 ఏళ్ల సీమాంధ్ర కుట్రలను భగ్నం చేసే జూరాల-పాకాల ప్రాజెక్టు డిజైన్ ఇది. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో సుదీర్ఘంగా ప్రవహించే కృష్ణానదిపై దిగువన ప్రాజెక్టులను రూపొందించి, ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటిని అందించడం సీమాంధ్ర ఇంజినీర్ల కుట్రల సూత్రం. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులను డిజైన్ చేస్తే కేవలం గ్రావిటీ (భూమ్యాకర్షణ శక్తిపై... కాలువల ద్వారా)పై నీళ్లొస్తాయి. తద్వారా ఒక్కసారి కాలువలు తవ్వితే తెలంగాణ జనం తరతరాలుగా నీటిని పొందేది. ఈ భూములు సస్యశ్యామలం అయ్యేవి. అందుకే ఇందుకు విరుద్ధంగా దిగువ ప్రాంతంలో పథకాలను డిజైన్ చేసి, ఎత్తిపోతల పథకాలకు ఎక్కువ ఖర్చవుతుందంటూ దశాబ్దాలు నానబెట్టి, ఒకవేళ అవి పూర్తి చేసినా ఒక్క టీఎంసీ నీటిని తీసుకోవాలన్నా రూ.కోట్ల కరెంటు బిల్లుల భారం పడేలా కుట్రలు పన్నారు. ఇప్పుడు తెలంగాణ సాకారమైంది. మన ఇంజినీర్లకు స్వేచ్ఛ వచ్చింది. సీమాంధ్ర పాలకులు బుట్టదాఖలు చేసినా ప్రతిపాదనలకు ఇప్పుడు రెక్కలొచ్చాయి. అందులో భాగంగానే ఈ జూరాల-పాకాల ప్రాజెక్టుకు జీవం వచ్చింది. మన మేథో సంపత్తి అయిన రిటైర్డ్ ఇంజినీర్లు రూపొందించిన డిజైన్ ఇది. తెలంగాణ మిత్రులతో పంచుకునేందుకు నేను ఈ పోస్టు పెడుతున్నాను. అందులోని కొన్ని వివరాలు మీకు అందిస్తున్నాను.
జూరాల-పాకాల ప్రాజెక్టు అంచనా వ్యయం - రూ.3వేల కోట్లు
ఎక్కడా కూడా నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. అంతా గ్రావిటీపైనే వస్తుంది. 405 కిలోమీటర్ల కాలువలు ఉంటాయి. ఇందులో 70 కిలోమీటర్ల టన్నెల్ (సొరంంగమార్గం) ఉంటుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని 700 చెరువులకు కూడా నీరు అందుతుంది.
! మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల రిజర్వాయర్ వద్ద నీటిని సేకరించేందుకు ఒక హెడ్‌రెగ్యులేటర్ ఏర్పాటు చేస్తారు. దీనిని 24వేల క్యూసెక్కుల డిశ్చార్జితో నిర్మిస్తారు.
! అక్కడ నుంచి ఓపెన్ కాలువ 85 కిలోమీటర్ల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తాపూర్ వరకు నీళ్లు వస్తాయి.
! అక్కడి నుంచి 70 కిలోమీటర్ల టన్నెల్ (సొరంగ మార్గం) ఉంటుంది. దీని వ్యాసం 15 మీటర్లు. అంటే హైదరాబాద్ తాగునీటి కృష్ణాజలాలను తరలించేందుకు వేసిన పైప్‌లైన్ సుమారు రెండున్నర మీటర్లలోపు. అదే కరీంనగర్ నుంచి గోదావరి నీటిని తెచ్చేందుకు వేస్తున్న పైపులైన్లు మూడు మీటర్లవి. అంటే వీటికంటే ఐదు రెట్టకుపైగా పెద్దగా ఉంటుంది.
! ఈ సొరంగ మార్గం నల్గొండ జిల్లాలోని చందంపేట మండలం (సాగునీటికి నోచుకోకుండా, అత్యంత వెనుకబడిన మండలం ఇది) వరకు ఉంటుంది.
అక్కడి నుంచి మరో మూడు కిలోమీటర్ల వరకు ఒపెన్ కాలువ ద్వారా నీటిని తీసుకుపోతారు.
! ఈ కాలువ ద్వారా వచ్చిన నీటిని చందంపేట మండల కేంద్రం సమీపంలో నిర్మించే మిడ్ డిండి రిజర్వాయర్‌లోకి వెళతాయి. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 11 టీఎంసీలు.
! ఇగ అక్కడి నుంచి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు (ఫ్లోరైడ్ భూతం ఉన్న ప్రాంతాలు) మీదుగా నల్గొండ దగ్గర ఉన్న బ్రాహ్మణవేలం ఆపై హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-9)ను దాటుకొని వెళుతుంది. అక్కడి నుంచి వరంగల్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
! చివరకు పాకాల రిజర్వాయర్ వరకు ఈ కాలువ ఉంటుంది. పాకాల రిజర్వాయర్ 3.4 టీఎంసీల సామర్థ్యంతో బలోపేతం చేస్తారు.
ఇదీ... తెలంగాణ అస్థిత్వమంటే?!
సీమాంధ్ర పాలనలో మనకు దోపిడీకి గురవడానికి కారణం సాంకేతికమైన సాకులు కూడా. ఏదైనా ఒక నదికి సంవత్సరంలో ఎన్ని రోజులు వరద వస్తుంది... (ఫ్లడ్‌డేస్) అనేది లెక్కిస్తారు. దాని ద్వారానే ప్రాజెక్టుల డిజైన్‌ను తయారు చేస్తారు. సీమాంధ్ర పాలనలో రూపొందించిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ)కి ఫ్లడ్‌డేస్ ఎంత పెట్టారో తెలుసా... 90 రోజులు. అంటే కృష్ణానదికి 90 రోజుల పాటు వరద వస్తున్నందున నింపాదిగా నీళ్లు తీసుకోవచ్చని హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం (ఒకవిధంగా నది నుంచి నీటిని తీసుకునేందుకు ఏర్పాటు చేసే రంధ్రం) తక్కువ పెట్టారు. కానీ శ్రీశైలం కుడి కాల్వ (ఎస్ఆర్‌బీసీ-రాయలసీమకు నీళ్లిచ్చేది)కు మాత్రం 45 రోజులు పెట్టారు. అంటే 45 రోజులు మాత్రమే వరద వస్తున్నందున తొందరగా నీళ్లు తీసుకోవాలని రంధ్రం పెద్దది పెట్టారు. మరి మన తెలంగాణ కొంప ముంచే పోతిరెడ్డిపాడుకు ఎంత లెక్కించారో తెలుసా... కేవలం 30 రోజులు. అంటే ఏడాదిలో కృష్ణానదికి 30 రోజులే వరద వస్తున్నందున తొందర తొందరగా ఎక్కువ నీళ్లు తీసుకోవాలని రంధ్రం చాలా పెద్దది పెట్టారు. ఇదీ... సీమాంధ్ర పాలనలో ఒకే నదికి వచ్చే వరద రోజులను వారికైతే అలా... మనకైతే ఇలా లెక్కించి కుట్రలు పన్నారు. అయితే ఈ కుట్రలో మన సన్నాసులు కూడా భాగస్వాములే. మరి... మన రాష్ట్రం సిద్ధించింది. అందుకే వరద రోజులను 35గా నిర్దరించుకున్నాం. ఏకంగా 24వేల క్యూసెక్కుల డిశ్చార్జితో హెడ్‌రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని డిజైన్ రూపొందించుకున్నం.

No comments:
Post a Comment