1

1

Wednesday, 25 June 2014

పారా హుషార్ తెలంగాణ సినీ ప్ర‌ముఖులారా..

సినీ ప‌రిశ్ర‌మ‌ను ముక్క‌లు చేసింది ఎవ‌రో మీకు తెలియ‌దా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ గారు..
నాలుగు కుటుంబాల క‌బంధ హ‌స్తాల్లో చిక్కుకున్న ప‌రిశ్ర‌మ‌ను అలాగే ఉంచాల‌ని మీరు చూస్తున్నారా?
రెండు రాష్ట్రాలుగా విడిపోయాం... ముమ్మాటికీ రెండు రాష్ట్రాల‌కు వేర్వేరుగా ఫిల్మ్ ఛాంబ‌ర్లు కొన‌సాగాల్సిందే
లేక‌పోతే సినీ రంగంలో తెలంగాణ‌పై ఉన్న వివ‌క్ష అలాగే కొన‌సాగుతుంది...
హైద‌రాబాద్‌లో సినీ పెద్ద‌లు కొంద‌రు ఆక్ర‌మించిన భూ క‌బ్జాల‌పై విచార‌ణ జ‌ర‌గాలి..
ఇది జ‌ర‌గాలంటే రెండు రాష్ట్రాల‌కు వేర్వేరుగా ఫెడ‌రేష‌న్లు ఉండాలి...
అయినా మీకు తెలుగుపై ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కాలేదండీ..
ఇంత‌కాలం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌గా కొన‌సాగిన దాన్ని ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌గా మార్చ‌డం వెన‌క మ‌త‌లబు ఏంటి..
అంటే తెలంగాణ‌కు వేరు ఫెడ‌రేష‌న్ రావొద్ద‌న్న కుట్రే క‌దా...
ఒక‌వేళ మీకు తెలుగుపై అంత మ‌మ‌కార‌మే ఉండిఉంటే ఇంత‌కాలం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ అని వాడేవారే కాదు..
హైద‌రాబాద్‌లో అక్ర‌మ ఆస్తులు కాపాడుకునేందుకు కొంద‌రు సినీ పెద్ద‌లే తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌గా మార్చే ప్ర‌తిపాద‌న తెచ్చారు..
దీన్ని ముమ్మాటికి తిప్పి కొట్టాలి...

పారా హుషార్ తెలంగాణ సినీ ప్ర‌ముఖులారా..
మీ అస్తిత్వాన్ని, ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకోండి...

---------------------------------------------------------------

తెలుగు సినీ పరిశ్రమను ముక్కలు చేయవద్దు : తమ్మారెడ్డి

హైదరాబాద్, జూన్ 14 : తెలుగు సినీ పరిశ్రమలు ఎవరూ ముక్కలు చేసే ప్రయత్నాలు చేయవద్దని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విజ్ఞప్తి చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమను విభజించడం వల్ల ఇరు ప్రాంతాల వారికి నష్టం చేకూరుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు ప్రత్యేక మూవీ ఫెడరేషన్ అవసరం లేదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాల ప్రజలకు నచ్చేలా సినిమా తీసినప్పుడు పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

No comments:

Post a Comment