భాష నేర్చుకోండి.. తెలుగులోనే మాట్లాడండి.. మాతృభాష గొప్పతనం ఇది అనే పెద్ద మనుషులు కొందరు ఆంగ్లంలో ఈ పోస్టులు రాస్తుంటారు.. ఈ భాషాభిమాన కుహానా మేధావుల తీరును చూస్తే నవ్వొస్తుంది.. వారి పిల్లలు ఆంగ్ల మాధ్యమ కాన్వెంట్‌లో చదువుతారు... వారి ఇంట్లో అందరూ అమెరికాకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు.. కానీ బీద, మధ్యతరగతి పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలా?
నేను తెలుగు మీడియాలో చదివాను.. ఆంగ్ల భాషపై పట్టు లేక కొంత అవస్థలు పడుతున్నా... మన ఎదుగుదలకు మన భాష కూడా అవరోధం కావొద్దు... మిత్రులారా.. మాతృభాషను మరవకండి.. అలాగని ఆంగ్లాన్ని దూరం పెట్టకండి... వీలైతే మన తెలంగాణ మేధావి, భారత దివంగత ప్రధాని పీవీ నరసింహారావు మాదిరిగా బహుభాషా కోవిదులం అవుదాం...!!!
No comments:
Post a Comment